Don Bradman has scored more Ashes runs for Australia than Steve Smith
Steve Smith : యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. రెండు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఆసీస్ ఓటమిని చవిచూసింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయినప్పటికి కూడా సీనియర్ ప్లేయర్, తాత్కాలిక సారథి స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత సాధించాడు.
టెస్టుల్లో ఇంగ్లాండ్ పై అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆసీస్ ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కాడు. మెల్‌బోర్న్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి స్మిత్ 33 పరుగులే చేసినప్పటికి కూడా అతడు ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు ఆసీస్ దిగ్గజ ఆటగాడు అలన్ బోర్డర్‌ను అధిగమించాడు.
Steve Smith : మెల్‌బోర్న్‌లో మేమేందుకు ఓడిపోయామంటే.. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కామెంట్స్..
అలన్ బోర్డర్ ఇంగ్లాండ్ పై 47 టెస్టులు ఆడాడు. 82 ఇన్నింగ్స్‌ల్లో 56.31 సగటుతో 3,548 పరుగులు సాధించాడు. ఇందులో 8 శతకాలు, 21 అర్థశతకాలు ఉన్నాయి. ఇక స్మిత్ విషయానికి వస్తే.. 72 ఇన్నింగ్స్‌ల్లో 55.51 సగటుతో 3553 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలు, 14 అర్థశతకాలు ఉన్నాయి.
ఇక టెస్టుల్లో ఇంగ్లాండ్ పై అత్యధిక పరుగులు చేసిన ఆసీస్ ఆటగాడి రికార్డు డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉంది. బ్రాడ్‌మన్ 63 ఇన్నింగ్స్‌ల్లో 89.78 సగటుతో 5028 పరుగులు చేశాడు. ఇందులో 19 శతకాలు 12 అర్థశతకాలు ఉన్నాయి.
ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా స్టీవ్ స్మిత్ నిలిచాడు. మెల్బోర్న్ టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లలో స్మిత్ కేవలం 33 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఇంగ్లాండ్ పై అతని మొత్తం స్కోరు 55.51 సగటుతో 3553 పరుగులు, 12 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 152 పరుగులు చేసింది. ఆ తరువాత ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్‌కు 42 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 132 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఇంగ్లాండ్ కు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి అందుకుంది.
PV Sindhu : చీరకట్టులో పీవీ సింధు.. అచ్చమైన తెలుగింటి అమ్మాయి..
కాగా.. ఇప్పటికే ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలి మూడు టెస్టుల్లో ఆసీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.