Kapil Dev: ఐపీఎల్‌లో ఆడటం వల్ల ఆటగాళ్లు ఒత్తిడికి గురవుతున్నట్లు చెబుతుంటారని, అంత ఒత్తిడి అనిపిస్తే ఐపీఎల్ ఆడటం మానేయాలని సలహా ఇచ్చారు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Bandi sanjay slams kcr: నల్లపిల్లితో కేసీఆర్ తాంత్రిక పూజలు.. ఓ స్వామీజీ చెప్పారు: బండి సంజయ్
ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఐపీఎల్‌లో ఆడటం వల్ల ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు నేను చాలా సార్లు టీవీల్లో చూశాను. అలాంటి ఆటగాళ్లకు నేను చెప్పేది ఒక్కటే.. ఒత్తిడికి గురవుతున్నామని భావిస్తే ఐపీఎల్‌లో ఆడటం మానేయండి. ఆటను ఇష్టపడితే ఎలాంటి ఒత్తిడీ ఉండదు. డిప్రెషన్ లాంటి అమెరికా పదాలు నాకు అర్థం కావు. నేను ఒక మాజీ ఆటగాడిగా చెబుతున్నాను. మేం ఆటను ఆస్వాదించాం. క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తే ఎలాంటి ఒత్తిడి ఉండదు’’ అని కపిల్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఇటీవల వివాదాస్పదమైన దీప్తి శర్మ-ఛార్లీ డీన్ అంశంపై కూడా కపిల్ స్పందించారు. ఇలాంటి సందర్భాల్లో ఒక రూల్ పాటిస్తే బాగుంటుందని తన అభిప్రాయమని చెప్పారు. బ్యాట్స్‌మెన్‌కు పరుగులు తొలగిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు.