Virat Kohli : మ‌ళ్లీ చెబుతున్నా.. ఎవరితోనైనా పెట్టుకోండి కానీ.. కోహ్లితో వ‌ద్దు.. బౌల‌ర్ల‌కు కీల‌క సూచ‌న‌

భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. మెగా టోర్నీకి మ‌రికొద్ది రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది.

Makhaya Ntini-Virat Kohli

Virat Kohli-Makhaya Ntini : భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) 2023 జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. మెగా టోర్నీకి మ‌రికొద్ది రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. ఈ నేప‌థ్యంలో బౌల‌ర్లకు ద‌క్షిణాఫ్రికా మాజీ పేస‌ర్ మ‌ఖ‌యా ఎన్తిని (Makhaya Ntini) కీల‌క సూచ‌న చేశాడు. మీరు ఎవ‌రితోనైనా పెట్టుకోండి ప‌ర్వాలేదు గానీ టీమ్ ఇండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లితో మాత్రం పెట్టుకోవ‌ద్ద‌ని చెప్పుకొచ్చాడు. కోహ్లీని స్లెడ్జ్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. అత‌డిని ఏమ‌న‌కుండా ఉంటే విసుగు చెంది అత‌డే పొర‌బాటు చేసి ఔట్ అయ్యే అవ‌కాశాలు ఉంటాయ‌ని తెలిపాడు.

Asia Cup 2023 : టీమ్ఇండియాకు భారీ షాక్‌.. పాక్‌తో మ్యాచ్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం

‘విరాట్ కోహ్లికి బౌలింగ్ చేసే ప్ర‌తి ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్‌కు నేను ఒక్క‌టే చెబుతున్నాను. కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న‌ప్పుడు స్లెడ్జ్ చేయ‌వ‌ద్దు. ఒక‌వేళ చేస్తే మాత్రం విరాట్ చేతుల్లో మీకు ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌దు. ఎందుకంటే అత‌డికి ఇలాంటి పోటీ అంటే ఎక్క‌డ లేని ఇష్టం. ఒక‌వేళ క‌నుక మీరు విరాట్‌ను ఏమీ అన‌కుండా ఉంటే.. అత‌డు దాన్ని విసుగుగా భావిస్తాడు. అప్పుడు అత‌డు త‌ప్పుడు చేసి ఔట్ అయ్యేందుకు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉంటాయి. అందుక‌నే కోహ్లి బౌలింగ్ చేసేట‌ప్పుడు బౌల‌ర్లు చాలా తెలివిగా ఆలోచించాలి.’ అని ఎన్తిని చెప్పాడు.

బుమ్రా శారీర‌క శ్ర‌మ త‌గ్గించుకుంటే మంచిది

బుమ్రా త‌న అనుభ‌వాన్ని ఉప‌యోగించుకుని సాధ్య‌మైనంత వ‌ర‌కు తెలివిగా బౌలింగ్ చేస్తూ శారీర‌క శ్ర‌మ త‌గ్గించుకోవాల‌ని ఎన్తిని సూచించాడు. మైదానంలో మరీ దూకుడుగా ఆడాల‌ని చూస్తే గాయం తిర‌గ‌బెట్టే అవ‌కాశం ఉంద‌న్నాడు. ముందు పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఆ త‌రువాత శ‌రీరాన్ని ఎంత క‌ష్ట‌పెట్టినా పెద్ద‌గా చింతించాల్సిన ప‌ని లేద‌న్నాడు.

Kashmir Cricket Bat: వరల్డ్ కప్‌లో మన బ్యాట్..! కశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్‌లకు పెరుగుతున్న క్రేజ్..

ప్ర‌పంచ‌క‌ప్ గెలిచేందుకు ఇదే మంచి అవ‌కాశం

ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ గెలిచేందుకు ఇదే మంచి అవ‌కాశం అని ఎన్తిని అభిప్రాయ‌ప‌డ్డాడు. జ‌ట్టులోని చాలా మంది ఆట‌గాళ్లు ఐపీఎల్‌లో ఆడార‌ని, దీంతో భార‌త‌దేశంలోని వాతావ‌ర‌ణం, పిచ్‌ల ప‌రిస్థితుల‌పై ఓ అవ‌గాహ‌న ఉంటుందన్నాడు. ముఖ్యంగా ర‌బాడ‌, నార్జే, ఎంగిడి వంటి ఫాస్ట్ బౌలింగ్ లైన‌ప్ ఎలాంటి చోటైన ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో ద‌డ పుట్టించేదే. మ‌హారాజ్‌, ష‌మ్సీ రూపంలో ఇద్ద‌రు నాణ్య‌మైన స్పిన్న‌ర్లు అందుబాటులో ఉన్నారు. బ్యాటింగ్‌లో డికాక్, బావుమా, మిల్లర్‌లు రాణిస్తే విజ‌యాలు సాధించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదన్నాడు.

Rohit Sharma : రూమ్‌లో కూర్చోని బాధ‌ప‌డుతుంటే.. యువ‌రాజ్ చేసిన ప‌నిని మ‌రిచిపోలేను