Rohit Sharma : రూమ్‌లో కూర్చోని బాధ‌ప‌డుతుంటే.. యువ‌రాజ్ చేసిన ప‌నిని మ‌రిచిపోలేను

మ‌హేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సార‌ధ్యంలో టీమ్ ఇండియా 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఆ స‌మ‌యంలో జ‌ట్టులో చోటు ద‌క్క‌నందుకు ప్ర‌స్తుత వ‌న్డే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) చాలా బాధ‌ప‌డిన‌ట్లు చెప్పాడు.

Rohit Sharma : రూమ్‌లో కూర్చోని బాధ‌ప‌డుతుంటే.. యువ‌రాజ్ చేసిన ప‌నిని మ‌రిచిపోలేను

Rohit Sharma-Yuvraj Singh

Rohit Sharma-Yuvraj Singh : మ‌హేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సార‌ధ్యంలో టీమ్ ఇండియా 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఆ స‌మ‌యంలో జ‌ట్టులో చోటు ద‌క్క‌నందుకు ప్ర‌స్తుత వ‌న్డే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) చాలా బాధ‌ప‌డిన‌ట్లు చెప్పాడు. ప్ర‌పంచ‌క‌ప్‌కు జ‌ట్టును ప్ర‌క‌టించిన స‌మ‌యంలో క‌నీసం రూమ్‌లోంచి బ‌య‌ట‌కు రాలేద‌న్నాడు. అప్ప‌డు సీనియ‌ర్ ఆట‌గాడు అయిన యువ‌రాజ్ సింగ్‌(Yuvraj Singh) చేసిన ప‌ని త‌న‌కు ఇంకా గుర్తుకు ఉంద‌ని హిట్‌మ్యాన్ తెలిపాడు.

Asia Cup : స‌చిన్ రికార్డుపై కోహ్లి, రోహిత్ క‌న్ను.. మొద‌ట బ్రేక్ చేసేది ఎవ‌రో..?

భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ఆరంభం కానుంది. ఆ మెగా టోర్నీ కోసం ప్రాథ‌మిక జ‌ట్టును ప్ర‌క‌టించ‌డానికి ఇంకా వారం రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. జ‌ట్టులో ఎవ‌రెవ‌రిని ఎంపిక చేస్తారు అనే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఈ క్ర‌మంలో ఓ మీడియా సంస్థ‌తో రోహిత్ మాట్లాడాడు. జ‌ట్టు ఎంపికలో చాలా అంశాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని చెప్పాడు. ‘ప్ర‌త్య‌ర్థి, పిచ్‌లు, బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు ఇలా అన్ని తీసుకోవాలి. అయితే.. ప్ర‌తీసారి అన్ని క‌రెక్ట్‌ నిర్ణ‌యాలు తీసుకోలేం. మ‌నం మ‌నుషులం.. ఒక్కొ సారి పొర‌బాట్లు జ‌రుగుతుంటాయి. ప్ర‌తీ సిరీస్‌కు జ‌ట్టును ఎంపిక చేసిన త‌రువాత జ‌ట్టులో చోటు ద‌క్క‌ని ఆట‌గాళ్ల‌తో విడిగా మాట్లాడుతుంటాను. జ‌ట్టులో ఎందుకు చోటు ద‌క్క‌లేద‌నే విష‌యాన్ని వివ‌రిస్తాను.’ అని రోహిత్ తెలిపాడు.

ODI World Cup 2023 : ఆరంభ వేడుక‌లు..! అప్ప‌ట్లో రిక్షాల‌పై ఎంట్రీ ఇచ్చిన కెప్టెన్లు.. ఇప్పుడెలా వ‌స్తారో..?

త‌న‌కు 2011 ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యంలో చోటు ద‌క్క‌నందుకు చాలా బాధ‌ప‌డిన‌ట్లు చెప్పాడు. ఆ స‌మ‌యంలో యువీ అండ‌గా నిలిచాడ‌న్నాడు. ‘జ‌ట్టుకు ఎంపిక కాక‌పోవ‌డం నిరాశ‌కు గురిచేసింది. రూమ్‌లోనే కూర్చుండి పోయా. ఏమీ అర్థం కావ‌డం లేదు. ఆ స‌మ‌యంలో యువీ న‌న్ను త‌న గ‌దికి పిలిచాడు. డిన్న‌ర్‌కు తీసుకువెళ్లాడు. అది నాకింకా గుర్తుకు ఉంది. అప్పుడు యువీ ఇలా చెప్పాడు. నీకు ఇంకా చాలా వ‌య‌స్సు ఉంది. నువ్వు ఈ స‌మ‌యాన్ని నీ ఆట, నైపుణ్యాల‌ను మెరుగుప‌ర‌చుకునేందుకు ఉప‌యోగించుకుని తిరిగి చోటు సంపాదించు అని యువీ అన్నాడు. అని ఆ నాటి ఘ‌ట‌న‌ను రోహిత్ పంచుకున్నాడు.