Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శుక్రవారం లక్నో వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలుపు జోష్‌లో ఉన్న లక్నో జట్టుకు డబుల్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌తో పాటు ముంబై పై విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మిస్టరీ స్పిన్నర్ దిగ్వేష్ రతికి జరిమానా పడింది.
ముంబైతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కొనసాగించినందుకు లక్నో కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఫైన్ పడింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయకపోవడంతో పంత్‌కు రూ.12లక్షల జరిమానా పడింది. ఈ సీజన్‌లో లక్నో.. స్లో ఓవర్ రేటుకు పాల్పడడం ఇదే తొలిసారి.
MS Dhoni : చెన్నై ఫ్యాన్స్‌కు శుభవార్త.. మళ్లీ కెప్టెన్‌గా ధోని.. రుతురాజ్ గైక్వాడ్‌కు షాక్..!
PBKS match – 25% of match fees & 1 Demerit Point.
MI match – 50% of match fees & 2 Demerit Points.
Lucknow got Digvesh Rathi for 30 Lakhs in the auction 📢 pic.twitter.com/RRkBsKz2WA
— Johns. (@CricCrazyJohns) April 5, 2025
మిస్టరీ స్పిన్నర్ దిగ్వేష్ రతి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని మరోసారి ఉల్లంఘించాడు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. అంతేకాదండోయ్ ఇది లెవల్ 1 నేరం కిందకు రావడంతో అతడి ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లను చేర్చారు. ప్రస్తుతం అతడి ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లు చేరాయి. ముంబైతో మ్యాచ్‌లో నమన్ ధీర్‌ను ఔట్ చేసిన తరువాత దిగ్వేష్ రతి నోటుబుక్ సంబరాలను చేసుకున్నాడు.
అంతకముందు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ప్రియాంశ్ ఆర్యను ఔట్ చేసిన దిగ్వేష్ అతడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి నోట్‌బుక్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్‌ను జత చేసిన సంగతి తెలిసిందే.
మరోసారి అతడు ఇదే విధమైన సెలబ్రేషన్స్ చేసుకుంటే మాత్రం అతడి పై ఓ మ్యాచ్ నిషేదం పడే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకూడదు అని అనుకుంటే ఈ మిస్టరీ స్పిన్నర్ వికెట్ తీసిన తరువాత నోట్‌బుక్ సెలబ్రేషన్స్‌ను మానుకోవాల్సి ఉంటుంది.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రతి నాలుగు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీశాడు. పర్పుల్ క్యాప్ రేసులో అతడు ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. మెగావేలంలో అతడిని లక్నో రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.