Suryakumar Yadav : తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్ పై సూర్యకుమార్ యాదవ్ రియాక్షన్ వైరల్.. ముంబై కోచ్ జయవర్ధనే నచ్చజెప్పినా కూడా..
తిలక్ వర్మను రిటైర్డ్ చేయాలని ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం పై విమర్శలు వస్తున్నాయి.

Courtesy BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు ఆటగాడు తిలక్ వర్మను రిటైర్డ్ చేయాలని ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం పై విమర్శలు వస్తున్నాయి. ముంబై విజయానికి 7 బంతుల్లో 24 అవసరం అయిన దశలో ముంబై ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఆఖరి ఓవర్లలో బౌండరీలు కొట్టేందుకు తిలక్ ఇబ్బందులు పడుతున్న సమయంలో ముంబై హెడ్ కోచ్ జయవర్ధనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని కోచ్ జయవర్ధనే డగౌట్‌లో కూర్చుని మ్యాచ్‌ను చూస్తున్న స్టార్ ఆటగాడు సూర్యకుమార్ కు చెప్పాడు. దీన్ని విన్న సూర్య ఆశ్చర్యపోయాడు. అతడు భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు.
అతడికి నచ్చజెప్పేందుకు జయవర్ధనే ప్రయత్నం చేశాడు. అయినప్పటికి తిలక్ రిటైర్డ్ ఔట్ పై అతడు సంతోషంగా లేనట్లుగా అనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తిలక్ వర్మ 23 బంతుల్లో 25 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇక తిలక్ స్థానంలో వచ్చిన సాంట్నర్ ఆడిన మొదటి బంతికే రెండు పరుగులు తీశాడు. దీంతో ముంబై విజయసమీకరణం 6 బంతుల్లో 22గా మారింది. అయితే.. ఆఖరి ఓవర్‌లో సాంట్నర్‌కు స్ట్రైకింగ్ ఇచ్చేందుకు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆసక్తి చూపలేదు. మ్యాచ్ ఓటమి ఖాయమైన తరువాత ఆఖరి బంతికి సాంట్నర్‌కు స్ట్రైకింగ్ ఇచ్చాడు.
Sky’s sad reaction for Tilak verma when they made him retired out.💔💔
It will truly dent the Confidence of Tilak Varma 🥺
pic.twitter.com/jJOy60cqAi— Radha (@Rkc1511165) April 5, 2025
అయితే.. ఆ బంతికి సాంట్నర్ పరుగులు ఏమీ చేయలేదు. దీంతో ముంబై 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్‌లో ముంబై ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా ఇది మూడో ఓటమి కావడం గమనార్హం.
ఇది ముమ్మాటికి నా నిర్ణయమే కోచ్ జయవర్ధనే..
తిలక్ వర్మను రిటైర్ చేయాలనేది తన నిర్ణయం అని మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్ధనే చెప్పాడు. తిలక్ ధాటిగా బ్యాటింగ్ చేస్తాడని అనుకున్నామని, అలా జరగలేదన్నాడు. మ్యాచ్ చివరి ఓవర్లో అయిన అతడు తన లయను అందుకుని హిట్టింగ్ చేస్తాడని చూశామని, అయితే.. అతడు షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడ్డాడని అన్నాడు. దీంతో కొత్త బ్యాటర్ ఎవరైనా వెళ్లి షాట్లు ఆడితే బాగుంటుందని అనిపించిందని, అందుకనే వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జయవర్ధనే తెలిపాడు.