LSG vs MI : ముంబైపై విజయం సాధించగానే లక్నో యజమాని సంజీవ్ గొయెంకా ఏం చేశాడో చూశారా? పంత్ ముఖంలో నువ్వులే.. నవ్వుల్..
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో లక్నో 4 నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. రెండు మ్యాచ్‌ల్లో గెలవగా, మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మొత్తంగా నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
మిచెల్ మార్ష్ (60; 31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఐడెన్ మార్‌క్రమ్ (53; 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఆయుష్ బదోని (19 బంతుల్లో 30 పరుగులు), డేవిడ్ మిల్లర్ (14 బంతుల్లో 27 పరుగులు) రాణించారు. రిషబ్ పంత్ (2), అబ్దుల్ సమద్(4), నికోలస్ పూరన్ (12) లు విఫలం అయ్యారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా ఐదు వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్, అశ్వనికుమార్, విఘ్నేష్ పుతూరు తలా ఓ వికెట్ సాధించారు.
A special night at Ekana! A well-fought victory, powered by an all-round team effort. Hats off to @ImMitchelmarsh, @Avesh_6, Digvesh Singh, Akash Deep, @DavidMillerSA12, @AyushBadoni11, Aiden Markram, and a crucial contribution from @imShard. And of course, the astute leadership… pic.twitter.com/ew4WUKN2oK
— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) April 4, 2025
ఆ తరువాత లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులకే పరిమితమైంది. సూర్యకుమార్ యాదవ్ (67; 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), నమన్ దీర్ (46; 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టారు. హార్దిక్ పాండ్యా (28 నాటౌట్), తిలక్ వర్మ (25) లు ఫర్వాలేదనిపించగా, ఓపెనర్లు విల్ జాక్స్ (5), ర్యాన్ రికెల్టన్ (10)లు విఫలం అయ్యారు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రతి తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో లక్నో విజయం సాధించడంతో లక్నో యజమాని సంజీవ్ గొయెంకా ఆనందంగా కనిపించాడు. మైదానంలోకి వెళ్లి కెప్టెన్ రిషబ్ పంత్‌ను కౌగలించుకున్నాడు. ఆ తరువాత అతడితో కాసేపు సంబాషించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో గొయెంకా, పంత్ ఆనందంగా ఉండడం కనిపిస్తుంది. ఎప్పుడు పంత్ ఇలాగే నవ్వుతూ ఉండాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. గెలిచినా, ఓడినా ఒకే రకంగా ఉండాలని గొయెంకాకు హితవు పలుకుతున్నారు.
పంత్ కామెంట్స్..
ముంబై గెలవడం పై పంత్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నిజం చెప్పాలంటే పిచ్ చాలా బాగుందన్నాడు. మనం రాణించడానికి ఏం పడుతుంది అనే విషయాన్ని గుర్తించగలన్నాడు. వాస్తవానికి తాము మరో రకమైన వికెట్ కోరుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే.. ఇప్పుడు పరిస్థితిని అంగీకరించాలి. దానికనుగుణంగా మార్పులు చేసుకుని ఆడడం ముఖ్యం అని తెలిపాడు.
మిచ్ మార్ష్ అద్భుత ఆరంభాన్ని ఇచ్చినప్పుడు మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి తగ్గుతుంది. వారు స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నిస్తారు. అదే మా వ్యూహం అని పంత్ అన్నాడు. మంచి భాగస్వామ్యాల వల్ల ముంబై ఎక్కువ వికెట్లు కోల్పోలేదు. ఆ సమయంలో కొంచెం ఒత్తడికి లోనయ్యాం. కానీ మేము చివరికి విజయం సాధించాం అని పంత్ చెప్పాడు.
ఇక శార్దూల్ ఠాకూర్ గురించి మాట్లాడుతూ.. అతడు అద్భుతమైన ఆటగాడు అని, అతడిని తీసుకోవడం సరైనదే అని నిరూపించుకున్నాడని చెప్పాడు. ఇక అతడు మా జట్టులో కీలక బౌలర్, ఒత్తిడిలోనూ నియంత్రణ కోల్పోకుండా అద్భుతమైన బంతులు వేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. యువ ఆటగాళ్లు ఇలాంటి పరిణితి చూపించడం చాలా ఆనందంగా ఉందన్నాడు.