WPL 2024 : డ‌బ్ల్యూపీఎల్‌లో డీఆర్ఎస్ వివాదం.. లెగ్ స్పిన్నర్ గూగ్లీగా!

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌) 2024లో ఓ డీఆర్ఎస్ నిర్ణ‌యం వివాదానికి దారితీసింది.

DRS Controversy Strikes WPL 2024 Chamari Athapaththu LBW Triggers Debate

WPL 2024 – Chamari Athapaththu : క్రికెట్‌లో సాంకేతిక అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత అంపైర్ల ప‌ని కొంచెం సులువైంది. అయితే.. కొన్ని సార్లు టెక్నాల‌జీని న‌మ్మాలో వ‌ద్దో అర్థం కాని ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌) 2024లో ఓ డీఆర్ఎస్ నిర్ణ‌యం వివాదానికి దారితీసింది. డ‌బ్ల్యూపీఎల్ రెండో సీజ‌న్‌లో భాగంగా సోమ‌వారం యూపీ వారియర్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది.

యూపీ వారియ‌ర్స్ బ్యాట‌ర్ చ‌మరి ఆట‌ప‌ట్టు ఔట్ పై ప్ర‌స్తుతం పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. వారియ‌ర్స్ ఇన్నింగ్స్ ఏడో ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. లెగ్‌స్పిన్న‌ర్ జార్జియా ఈ ఓవ‌ర్‌ను వేసింది. ఈ ఓవ‌ర్‌లోని మూడో బంతిని పుల్‌టాస్‌గా వేసింది. ఆట‌ప‌ట్టు షాట్ ఆడాల‌ని చూడ‌గా బంతి బ్యాట్‌ను మిస్సై ప్యాడ్ల‌ను తాకింది. దీంతో బెంగ‌ళూరు ఫీల్డ‌ర్లు ఔట్ అంటూ అప్పీల్ చేయ‌గా ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్ర‌క‌టించారు.

PSL : చిన్నా నువ్వు మాత్రం గ్రౌండ్‌లోకి రాకు.. వ‌చ్చావో బ్యాట‌ర్ల వెన్నులో వ‌ణుకే..!

అంపైర్ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన రివ్వ్యూకి వెళ్లింది. బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్ల‌ను తాకుతున్న‌ట్లు చూపించింది. అంతేకాదు అది లెగ్ స్పిన్ కాద‌ని గూగ్లీ అని సూచించింది. నాటౌట్‌ నుంచి ఔట్‌గా మారుతున్న నిర్ణయాన్ని చూసిన బ్యాట‌ర్ ఆట‌ప‌ట్టు, నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న మ‌రో బ్యాట‌ర్ అలిస్సా హీలీ ఆశ్చ‌ర్య‌పోయారు. థ‌ర్డ్ అంపైర్ ఔట్‌గా ప్ర‌క‌టించ‌డంతో ఫీల్డ్ అంపైర్ సైతం త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు.

దీంతో నో వే అంటూ బిగ్గ‌ర‌గా అరుస్తూ ఆట‌ప‌ట్టు మైదానాన్ని వీడ‌డం కెమెరాలో క‌నిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ్యాచ్ ముగిసిన త‌రువాత దీనిపై యూపీ కోచ్ స్పందించారు. డీఆర్ఎస్ నిర్ణ‌యం పై అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఆ బాల్‌ను గమ‌నిస్తే అది లైన్‌లోనే పిచ్ అవుతుంద‌ని అనుకుంటారు. ఆ బాల్ లెగ్‌స్పిన్‌లా తిరిగింది. ఈ ఔట్‌తో ఆట స్వ‌రూప‌మే మారిపోయింది. నిజానికి సాంకేతిక ఎలా ప‌ని చేస్తుందో నాకు తెలియ‌దు. ఆ నిర్ణ‌యంలో మాత్రం విసుగు చెందిన‌ట్లు చెప్పారు. చ‌మ‌రి ఆట‌ప‌ట్టు అద్భుత ప్లేయ‌ర్ అని కొద్ది సేపు క్రీజులో ఉండి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

Viral Video : దీంతో కూడా ఆడొచ్చ‌ని అప్ప‌ట్లో తెలిసుంటేనా..? ఎప్పుడో బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌ను అయ్యేవాడిని!

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 198 ప‌రుగులు చేసింది. ఆర్‌సీబీ బ్యాట‌ర్ల‌లో స్మృతి మంధాన (80; 50 బంతుల్లో 10 ఫోర్లు, 3సిక్స‌ర్లు), ఎల్లీస్ పెర్రీ (58; 37 బంతుల్లో 4 ఫోర్లు, 4సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలో రాణించారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో యూపీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 175 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. దీంతో ఆర్‌సీబీ 23 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

ట్రెండింగ్ వార్తలు