SA vs BAN : బంగ్లాదేశ్ కొంపముంచిన ఐసీసీ రూల్‌.. గెలిచే మ్యాచ్‌లో ఓట‌మి.. సౌతాఫ్రికా ల‌క్కీ..

అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యం ఇస్తున్న మ్యాచులు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి.

PIC Credit : ICC

అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యం ఇస్తున్న మ్యాచులు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. బౌల‌ర్ల హ‌వా కొన‌సాగుతుండ‌డంతో లోస్కోరింగ్ మ్యాచ్‌లు న‌మోదు అవుతున్నాయి. న్యూయార్క్‌లోని నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సోమ‌వారం రాత్రి ద‌క్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికా నాలుగు ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని సాధించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో ఓ ఐసీసీ రూల్ బంగ్లాదేశ్ కొంప‌ముంచింది. లేదంటే మ్యాచ్ ఫ‌లితం వేరేలా ఉండే అవ‌కాశం ఉంది.

ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 113 ప‌రుగులు చేసింది. స‌ఫారీ బ్యాట‌ర్ల‌లో హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 46) టాప్ స్కోరర్. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమైంది. తౌహిద్ హృదోయ్ (34 బంతుల్లో 37) పోరాడినా ఓట‌మి త‌ప్ప‌లేదు.

SA vs BAN : సౌతాఫ్రికా సేఫ్‌.. టెన్ష‌న్ పెట్టిన బంగ్లా పులులు..

అస‌లేం జ‌రిగిందంటే..?

బంగ్లాదేశ్ విజ‌యానికి ఆఖ‌రి నాలుగు ఓవ‌ర్ల‌లో 27 ప‌రుగులు అవ‌స‌రం. ఇన్నింగ్స్ 17వ ఓవ‌ర్‌ను బార్టమన్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని రెండో బంతిని మ‌హ్మ‌దుల్లా ప్లిక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా బంతి అత‌డి ప్యాడ‌ను త‌గిలి ఫైన్ లెగ్ మీదుగా బౌండ‌రీకి వెళ్లింది. ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్లు అప్పీల్ చేయ‌గా అంపైర్ ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ ఇచ్చాడు. బంగ్లా బ్యాట‌ర్ వెంట‌నే రివ్యూకి వెళ్లాడు. రిప్లైలో అది నాటౌట్‌గా తేలింది. దీంతో ఆన్‌ఫీల్డ్ అంఫైర్ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నాడు.

ఆ బంతికి అత‌డు ఔట్ కాన‌ప్ప‌టికి బంగ్లాదేశ్ స్కోరుకు నాలుగు ప‌రుగులు క‌ల‌ప‌లేదు. ఇందుకు కార‌ణం అంఫైర్ వేలు ఎత్త‌డ‌డంతో ఆ బంతిని డెడ్‌బాల్‌గా ప‌రిగణించారు. అక్క‌డ అంఫైర్ పొర‌బాటు ఉన్న‌ప్ప‌టికీ ఐసీసీ రూల్ బుక్‌లోని డెడ్ బాల్ చట్టంలోని 20.1.1.3 నిబంధ‌న ప్ర‌కారం బంగ్లాకు ప‌రుగులు క‌ల‌ప‌డం సాధ్య ప‌డ‌లేదు.

IND vs PAK : పాక్ పై భార‌త్ విజ‌యం.. న్యూయార్క్ పోలీసుల‌కు ఢిల్లీ పోలీసుల ట్వీట్‌..

ఉదాహరణకు.. ప్యాడ్లకు బాల్‌ తగిలిన తర్వాత ఓ బ్యాటర్ సింగిల్ తీశాడు. ఈ లోపు అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అనంతరం బ్యాటర్ రివ్యూకి వెళ్లి నాటౌట్ అని తేలినా ఆ ఒక్క పరుగు స్కోరు బోర్డులో నమోదు కాదు. బంతిని కౌంట్ చేస్తారు. ఇలాంటి స‌మ‌యాల్లో బ్యాటింగ్ టీమ్‌కు న‌ష్టం జ‌రుగుతంది.

కాగా.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆఖ‌రికి నాలుగు ప‌రుగుల‌తో ఓడిపోవ‌డంతో ఈ రూల్ పై ప్ర‌స్తుతం చ‌ర్చ‌మొద‌లైంది. ప‌లువురు మాజీ ఆట‌గాళ్లు ఈ నిబంధ‌న‌ను మార్చాల‌ని కోరుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు