SA vs BAN : సౌతాఫ్రికా సేఫ్‌.. టెన్ష‌న్ పెట్టిన బంగ్లా పులులు..

ఇటీవ‌ల ముగిసిన ఐపీఎల్‌లో బ్యాట‌ర్ల హ‌వా కొన‌సాగ‌గా.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో బౌల‌ర్లు దుమ్ములేపుతున్నారు.

SA vs BAN : సౌతాఫ్రికా సేఫ్‌.. టెన్ష‌న్ పెట్టిన బంగ్లా పులులు..

PIC credit : ICC

South Africa vs Bangladesh : ఇటీవ‌ల ముగిసిన ఐపీఎల్‌లో బ్యాట‌ర్ల హ‌వా కొన‌సాగ‌గా.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో బౌల‌ర్లు దుమ్ములేపుతున్నారు. బౌల‌ర్లు విజృంభిస్తుండ‌డంతో ప‌రుగులు చేసేందుకు బ్యాట‌ర్లు ఆప‌సోపాలు ప‌డుతున్నారు. ఫ‌లితంగా లోస్కోరింగ్ మ్యాచులు న‌మోదు అవుతున్నాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సోమ‌వారం రాత్రి బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 113 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కాపాడుకుంది.

4 ప‌రుగుల తేడాతో స‌ఫారీ జ‌ట్టు విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో ద‌క్షిణాఫ్రికా సూప‌ర్ 8 బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచిన సౌతాఫ్రికా ఆరు పాయింట్ల‌తో గ్రూపు-డిలో అగ్ర‌స్థానంలో నిలిచింది. త‌న ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌ను నేపాల్‌తో ఆడ‌నుంది.

హర్భజన్ సింగ్ దెబ్బకు క్షమాపణలు చెప్పిన పాక్ మాజీ క్రికెటర్.. అసలు గొడవ ఏమిటంటే?

ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 113 ప‌రుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (46; 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (29; 38 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించారు. రీజా హెండ్రిక్స్ (0), కెప్టెన్ మార్‌క్ర‌మ్ (4), ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ (0) విఫ‌లం అయ్యారు. ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్ (18) ఫ‌ర్వాలేద‌నిపించాడు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో తంజీమ్ హసన్ షకీబ్ మూడు వికెట్లు తీశాడు. త‌స్కిన్ అహ్మద్ రెండు, రిషద్ హొస్సేన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమైంది. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో ల‌క్ష్య ఛేద‌న‌లో బంగ్లా క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు కోల్పోయింది. ప‌ది ఓవ‌ర్లు ముగిసే స‌రికి నాలుగు వికెట్లు కోల్పోయి 50 ప‌రుగులు చేసింది. అయితే.. ఈ ద‌శ‌లో తౌహిద్ హృదోయ్ (37; 34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మదుల్లా (20; 27 బంతుల్లో 2 ఫోర్లు) ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్య‌త‌ల‌ను భుజాన వేసుకున్నారు.

Pakistan Fan : ట్రాక్ట‌ర్ అమ్మేసా.. పాక్ ఓడిపోయింది..ఇప్పుడెలా..?

వీరిద్ద‌రు ఐదో వికెట్‌కు 44 ప‌రుగులు జోడించారు. బంగ్లా విజ‌యానికి ఆఖ‌రి మూడు ఓవ‌ర్ల‌లో 20 ప‌రుగులు చేయాల్సిన స‌మ‌యంలో తౌహిత్‌ను ర‌బాడ చేయ‌డంతో పాటు ఆ ఓవ‌ర్‌లో కేవ‌లం రెండు ప‌రుగులే ఇవ్వ‌డంతో మ్యాచ్ ఉత్కంఠ‌గా మారింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. స్పిన్న‌ర్ కేశ‌వ్ మ‌హ‌రాజ్ బంతిని రెండు వికెట్లు ప‌డ‌గొట్టి ఆరు ప‌రుగులే ఇచ్చాడు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో కేశవ్ మహరాజ్ మూడు, నోకియా, రబాడ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.