Duleep Trophy 2025 final Super catch taken by captain Rajat Patidar
Rajat Patidar : బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ లో దులీప్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) ఓ అద్భుత క్యాచ్ అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ టాస్ గెలిచింది. ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అతడి అంచనాలను నిజం చేస్తూ బౌలర్లు చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ సోన్ 149 పరుగులకే కుప్పకూలింది. సౌత్ జోన్ బ్యాటర్లలో తన్మయ్ అగర్వాల్ (31) ఫర్వాలేదనిపించాడు.
మిగిలిన వారు విఫలం కావడంతో సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైంది. సెంట్రల్ జోన్ బౌలర్లలో సరాంశ్ జైన్ ఐదు వికెట్లు తీశాడు. కుమార్ కార్తికేయ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
పాటిదార్ సూపర్ క్యాచ్..
ఇన్నింగ్స్ 49 ఓవర్‌ను సరాంశ్ జైన్ వేశాడు. ఈ ఓవర్‌లోని మూడో బంతికి సౌత్ జోన్ బ్యాటర్ సల్మాన్ నిజార్ డిఫెన్స్ షాట్ ఆడాడు. అయితే.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. షార్ట్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేయగా.. అతడి చేతిని తాకి బంతి మరింత వెనుకగా వెళ్లింది.
What a catch by captain Rajat Patidar. 🔥pic.twitter.com/7dmc1IKucM
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2025
Kuldeep Yadav : టీ20ల్లో కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనత..
అయితే.. సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రజత్ పాటిదార్ మెరుపు వేగంతో స్పందించి డైవ్ చేస్తూ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.