×
Ad

RCB : న్యూఇయ‌ర్‌కు ముందు ఆర్‌సీబీకి బిగ్‌షాక్‌..

మ‌హిళల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌) 2026 సీజ‌న్ ప్రారంభానికి ముందే రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB ) జ‌ట్టుకు గ‌ట్టి షాక్ త‌గిలింది.

Ellyse Perry has decided to pull out of Tata WPL 2026 for personal reasons

RCB : మ‌హిళల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌) 2026 సీజ‌న్ ప్రారంభానికి ముందే రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ప్లేయ‌ర్‌, ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ ఎల్లిస్ పెర్రీ డ‌బ్ల్యూపీఎల్ 2026 సీజ‌న్ నుంచి త‌ప్పుకుంది. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే ఆమె ఈ నిర్ణ‌యం తీసుకుంది.

Harmanpreet Kaur : మిథాలీరాజ్ ఆల్‌టైమ్‌ రికార్డును సమం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్

2024లో ఆర్‌సీబీ డ‌బ్ల్యూపీఎల్ విజేత‌గా నిలిచింది. ఆ సీజ‌న్‌లో ఆర్‌సీబీ క‌ప్పును ముద్దాడంలో ఎల్లిస్ పెర్రీ కీల‌క పాత్ర పోషించింది. డ‌బ్ల్యూపీఎల్ 2026 సీజ‌న్‌లో విజేత‌గా నిలిచి మ‌రోసారి క‌ప్పును కైవ‌సం చేసుకోవాల‌ని భావిస్తున్న ఆర్‌సీబీకి ఎల్లిస్ దూరం కావ‌డం గ‌ట్టి ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు. ఆమె స్థానంలో ఆర్‌సీబీ స‌యాలీ సత్ఘరే జ‌ట్టులోకి తీసుకుంది. ఆమె క‌నీస ధ‌ర 30 ల‌క్ష‌ల‌కే ఆర్‌సీబీ సొంతం చేసుకుంది.

చీలమండ గాయం తిర‌గ‌బెట్టిందా?
గ‌త కొన్నాళ్లుగా ఎల్లిస్ పెర్రీని చీల‌మండ‌ల గాయం ఇబ్బంది పెడుతోంది. ఇటీవ‌ల ఈ గాయం తిర‌గ‌బెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించ‌డంతోనే ఆట‌కు కొన్నాళ్లు విరామం ఇవ్వాల‌నే నిర్ణ‌యాన్ని ఎల్లిస్ తీసుకుంది. ఈ క్ర‌మంలోనే ఆమె డ‌బ్ల్యూపీఎల్‌కు దూర‌మైంది.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ కూతురు స‌మైరా బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్.. ఫోటోలు వైర‌ల్‌

డ‌బ్ల్యూపీఎల్ 2026కి ఆర్‌సీబీ జ‌ట్టు ఇదే..
స్మృతి మంధాన, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్, పూజా వస్త్రాకర్, గ్రేస్ హారిస్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, నాడిన్ డి క్లెర్క్, జార్జియా వోల్, లిన్సే స్మిత్, దయాళన్ హేమలత, ప్రేమ రావత్, గౌతమి నాయక్, ప్రత్యూష కుమార్, సయాలీ సత్ఘరే.