Harmanpreet Kaur : మిథాలీరాజ్ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్
అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న భారత ప్లేయర్‌గా మిథాలీ రాజ్ పేరిట ఉన్న రికార్డును హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సమం చేసింది.
Most PoTM awards for India Women in T20Is Harmanpreet Kaur equals Mithali Raj record
Harmanpreet Kaur : భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న భారత ప్లేయర్ రికార్డును సమం చేసింది. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 12 సార్లు టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుంది.
మంగళవారం తిరువనంతపురం వేదికగా శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో రాణించిన హర్మన్ ప్రీత్ కౌర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. టీ20ల్లో హర్మన్‌కు ఇది 12వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. ఇదిలా ఉంటే.. మిథాలీ 89 టీ20 మ్యాచ్‌ల్లోనే 12 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవగా హర్మన్ 189 మ్యాచ్‌ల్లో సమం చేసింది.
Rohit Sharma : రోహిత్ శర్మ కూతురు సమైరా బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ప్లేయర్లు వీరే..
* హర్మన్ ప్రీత్ కౌర్ – 12 సార్లు
* మిథాలీ రాజ్ – 12 సార్లు
* షఫాలీ వర్మ – 8 సార్లు
* స్మృతి మంధాన – 8 సార్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ (68; 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేసింది. అరుంధతి రెడ్డి (27 నాటౌట్; 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఆఖరిలో వేగంగా ఆడింది. లంక బౌలర్లలో కవిషా దిల్హారి, రష్మిక సెవ్వండి, చమరి అథాపత్తు లు తలా రెండు వికెట్లు తీశారు.
అనంతరం హాసిని పెరీరా (65; 42 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), ఇమేషా (50; 39 బంతుల్లో 8 ఫోర్లు) మెరుపులు మెరిపించినప్పటికి 176 పరుగుల లక్ష్య ఛేదనలో లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులే చేసింది. దీంతో భారత్ 15 పరుగుల తేడాతో గెలుపొంది 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
