INDw vs SLW : అందుకే మేం ఓడిపోయాం.. లేదంటేనా.. సిరీస్ ఓటమిపై శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు కామెంట్స్..
తిరువనంతపురం వేదికగా భారత మహిళల జట్టుతో (INDw vs SLW ) జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో శ్రీలంక జట్టు ఓడిపోయింది.
Chamari Athapaththu comments after Srilanka women lost t20 series India pic credit @imfemalecricket
- ఐదో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చేతిలో ఓడిపోయిన శ్రీలంక
- సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్
- సిరీస్ ఓటమిపై శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు స్పందన
INDw vs SLW : తిరువనంతపురం వేదికగా భారత మహిళల జట్టుతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో శ్రీలంక జట్టు ఓడిపోయింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో లంక జట్టు భారత్ చేతిలో వైట్‌వాష్ కు గురైంది. ఈ నేపథ్యంలో ఐదో టీ20 మ్యాచ్‌లో ఓటమితో పాటు సిరీస్ కోల్పోవడం పట్ల శ్రీలంక మహిళల జట్టు కెప్టెన్ చమరి ఆటపట్టు స్పందించింది.
ఈ సిరీస్‌లో తమ అత్యుత్తమ క్రికెట్‌ను ఆడలేకపోయినట్లు వెల్లడించింది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో తాము ఎంతో మెరుగు అవ్వాల్సి ఉందని చెప్పింది. ఇక ఈ సిరీస్ ఓడిపోయినప్పటికి కూడా కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయని అంది. ఈ సిరీస్ ద్వారా యువ ప్లేయర్లు అనుభవాన్ని గడించారని అంది. వారు సిరీస్ మధ్యలో మంచి క్రికెట్ ఆడారని చెప్పింది. తదుపరి సిరీసుల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది.
Damien Martyn : మార్టిన్ నీకేమైంది.. కోమాలో ఆసీస్ దిగ్గజ ఆటగాడు.. పరిస్థితి విషమం..
తనతో పాటు సీనియర్ ప్లేయర్లు ఇనోకా, నీలక్షి, హసిని వంటి వారు ఈ సిరీస్‌తో తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేదని చెప్పింది. అయినప్పటికి కూడా యువ ప్లేయర్లు తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇంకా టీ20 ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉందని, ఈ లోగా జట్టును పటిష్టం చేసుకుంటామంది.
ఆఖరి మ్యాచ్‌లో భారత్‌కు గట్టి పోరాటం ఇచ్చామని, అయితే దురదృష్టవశాత్తు మ్యాచ్‌లో ఓడిపోయామంది. ఇక ఈ సిరీస్‌ను ఎంతో ఆస్వాదించామని, బీసీసీఐ, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసింది.
Deepti Sharma : దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. మహిళల టీ20 క్రికెట్‌లో ఏకైక బౌలర్..
ఐదో టీ20 మ్యాచ్ విషయానికి వస్తే.. హర్మన్‌ప్రీత్ కౌర్ (68; 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 176 పరుగుల లక్ష్య ఛేదనలో హాసిని పెరీరా (65; 42 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), ఇమేషా (50; 39 బంతుల్లో 8 ఫోర్లు) పోరాడినప్పటికి శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది.
