Damien Martyn : మార్టిన్ నీకేమైంది.. కోమాలో ఆసీస్ దిగ్గజ ఆటగాడు.. పరిస్థితి విషమం..
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డామియర్ మార్టిన్ (Damien Martyn) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసీస్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Former Australian cricketer Damien Martyn is in serious condition in Brisbane hospital
- మెనింజిటిస్ వ్యాధితో బాధపడుతున్న డామియన్ మార్టిన్
- బ్రిస్బేన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స
- ప్రస్తుతం కోమాలో ఉన్న మార్టిన్, పరిస్థితి విషమం
Damien Martyn : ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డామియన్ మార్టిన్ ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉంది. అతడు బ్రిస్బేన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడు కోమాలో ఉన్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో అతడికి ఇండ్యూస్డ్ కోమా పద్ధతిలో చికిత్స అందిస్తున్నారు. మార్టిన్ మెనింజిటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది.
ఇక మార్టిన్ సహచర ఆటగాళ్లు డారెన్ లెమన్, ఆడమ్ గిల్ క్రిస్ట్‌లు అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మార్టిన్ అభిమానులు, నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Deepti Sharma : దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. మహిళల టీ20 క్రికెట్‌లో ఏకైక బౌలర్..
కుడి చేతి వాటం బ్యాటర్ అయిన మార్టిన్ ఆస్ట్రేలియా తరుపున 1992 నుంచి 2006 మధ్య ఆడాడు. 67 టెస్టులు, 208 వన్డేలు, 4 టీ20ల్లో ఆసీస్ కు ప్రాతినిధ్యం వహించాడు. 67 టెస్టుల్లో 46.4 సగటుతో 4406 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

pic credit @cricketcomau
ఇక 208 వన్డేల్లో 40.8 సగటుతో 5346 పరుగులు చేవాడు. ఇందులో 5 శతకాలు, 37 అర్థశతకాలు ఉన్నాయి. ఇక 4 టీ20ల్లో 30 సగటుతో 120 పరుగులు సాధించాడు. 2003లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో మార్టిన్ సభ్యుడిగా ఉన్నాడు. ఈ మెగాటోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ పై 88 పరుగులు చేసి రికీ పాంటింగ్‌తో 234 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
Smriti Mandhana : గిల్ వరల్డ్ రికార్డు సేఫ్.. బ్రేక్ చేయలేకపోయిన మంధాన.. కారణం ఇదే..
ఇక మార్టిన్ ఐపీఎల్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అతడు 2010లో ఆడిన ఒకే ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో 19 పరుగులు చేశాడు.
