IPL 2024 : డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శ‌ర్మ క‌న్నీళ్లు..! మైదానంలో హార్దిక్ పాండ్య న‌వ్వులే న‌వ్వులు

టీమ్ఇండియా కెప్టెన్‌, ముంబై ఇండియ‌న్స్ స్టార్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని క‌న్నీళ్లు పెట్టుకున్న ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Rohit Sharma – Hardik Pandya : టీమ్ఇండియా కెప్టెన్‌, ముంబై ఇండియ‌న్స్ స్టార్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని క‌న్నీళ్లు పెట్టుకున్న ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సోమ‌వారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్ సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు నెటిజ‌న్లు అంటున్నారు.

ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 173 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (48; 30 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్స్‌), కెప్టెన్ కమిన్స్ (35 నాటౌట్‌; 17 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్స‌ర్లు) లు రాణించారు. ముంబై బౌల‌ర్ల‌లో హార్దిక్ పాండ్య, పీయూష్ చావ్లా లు చెరో మూడు వికెట్లు తీశారు. కాగా.. ల‌క్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 17.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Rohit Sharma : ఏంట‌య్యా రోహిత్.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముందు ఫామ్ కోల్పోయావు.. ఇలాగైతే క‌ష్ట‌మే!

సూర్యకుమార్ యాదవ్ (102 నాటౌట్‌; 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) అజేయ సెంచ‌రీతో చెలరేగాడు. సూర్యకు తోడుగా తిలక్ వర్మ (37 నాటౌట్‌; 32 బంతుల్లో 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

కాగా.. ఈమ్యాచ్‌లో ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ (4; 5 బంతుల్లో 1 ఫోర్‌) సింగిల్ డిజిట్‌కే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. క‌మిన్స్ బౌలింగ్‌లో క్లాసెన్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. రోహిత్ తో పాటు ఇషాన్ కిష‌న్ (9), న‌మ‌న్ దీర్ (0) లు విఫ‌లం కావ‌డంతో ముంబై ఇండియ‌న్స్ 31 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. సూర్య‌కుమార్ యాద‌వ్, తిల‌క్ వ‌ర్మ‌లు జ‌ట్టును ఆదుకునే ప‌నిలో ఉన్నారు.

Suryakumar Yadav : రోహిత్ శ‌ర్మ‌ రికార్డును స‌మం చేసిన సూర్య‌కుమార్‌.. ఆనందంలో అభిమానులు

ప‌వ‌ర్ ప్లే లో ఆఖ‌రి రెండు బంతులు మిగిలిన ఉన్న స‌మ‌యంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న రోహిత్ వైపు కెమెరామెన్లు జూమ్ చేయ‌గా.. అత‌డు బాద‌తో క‌న్నీళ్లు తుడుచుకుంటున్న‌ట్లుగా క‌నిపించింది. ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా రోహిత్ క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం పై నెటిజ‌న్లు రెండుగా విడిపోయారు.

ముంబై వ‌రుస‌గా నాలుగు మ్యాచులు ఓడిపోగా.. ఈ మ్యాచ్‌లో కూడా ఓడిపోతామ‌ని భావించి హిట్‌మ్యాన్ క‌న్నీళ్లు పెట్టుకున్నాడ‌ని కొంద‌రు అంటుండ‌గా మ‌రికొంద‌రు మాత్రం టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు ఫామ్ కోల్పోవ‌డంతోనే రోహిత్ బాధ‌ప‌డ్డాడ‌ని అంటున్నారు. అయితే.. అస‌లు రోహిత్ ఎందుకు బాధ‌ప‌డ్డాడు అనే విష‌యం స్వ‌యంగా అత‌డు చెబితే గాని ఎవ్వ‌రికి తెలియ‌దు.

హార్దిక్ పాండ్య ఆనందం..

వ‌రుస‌గా నాలుగు మ్యాచులు ఓడిపోయిన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్య ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఇక ఈ మ్యాచ్‌లో అత‌డు బౌలింగ్‌లో కూడా రాణించ‌డం మ‌రో కార‌ణం. మొత్తంగా ముంబై మ్యాచ్ గెలిచిన అనంత‌రం గ్రౌండ్‌లో ఉన్న హార్దిక్ పాండ్య ముఖం వెలిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

RCB : ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే.. ఈ 4 నాలుగు జ‌ర‌గాల్సిందే

ట్రెండింగ్ వార్తలు