ENG vs IND 1st test Karun Nair duck out in reentry match
ఇంగ్లాండ్‌తో సిరీస్ ద్వారా కరుణ్ నాయర్ భారత టెస్టు జట్టులో రీ ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నాలుగంటే నాలుగే బంతులు ఆడి డకౌట్ అయ్యాడు.
హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఓలీ పోప్ చక్కటి క్యాచ్ అందుకోవడంతో కరుణ్ నాయర్ నిరాశగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో నాయర్ పై నెట్టింట ట్రోల్స్ మొదలు అయ్యాయి.
ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ (147) ఔటైన తరువాత కరుణ్ నాయర్ క్రీజులోకి వచ్చాడు. అప్పటికి భారత జట్టు స్కోరు 430/4గా ఉంది. ఓ వైపు పంత్ ధాటిగానే ఆడుతున్నాడు. పరుగులు చేయాలన్న ఒత్తిడి కరుణ్ నాయర్ పై లేనేలేదు. నెమ్మదిగా క్రీజులో కుదురుకుని రన్స్ చేయొచ్చు. కానీ అతడు మాత్రం అనవసరంగా షాట్ కోసం ప్రయత్నించి చేజేతులా వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు.
Rishabh Pant : సిక్సర్‌తో రిషబ్ పంత్ సెంచరీ.. ఎంఎస్ ధోని రికార్డు బ్రేక్..
ఈ ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు సాధించి, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఆలౌటైతే మాత్రం భారత్‌కు మరో సారి బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవచ్చు. అదే జరిగితే రెండో టెస్టుకు నాయర్ బెంచీకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లు జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు.
Karun Nair falls for a duck in his comeback Test after 8 years 😔🦆
📸: Jio Hotstar#KarunNair #ENGvsIND pic.twitter.com/xMEFeqxAXd
— CricTracker (@Cricketracker) June 21, 2025
God can give you a chance but it is up to you whether you make it or waste it .#karunnair #INDvsENG https://t.co/locKgFNLYt pic.twitter.com/lkGBXj2xhL
— 𝐀𝐧𝐤𝐢𝐭 𝐒𝐡𝐚𝐫𝐦𝐚 𝕏 (@Ankit_S1111) June 21, 2025
Please Cricket give me one more chance so that i can prove my critics correct 🙂#karunnair #ENGvsIND
— Chinmay (@ThirdManVibes) June 21, 2025