Rishabh Pant : సిక్సర్‌తో రిషబ్ పంత్ సెంచరీ.. ఎంఎస్ ధోని రికార్డు బ్రేక్..
టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ సెంచరీ చేశాడు.

టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్‌తో హెడింగ్లీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో 146 బంతుల్లో పంత్ శతకాన్ని సాధించాడు. ఇందులో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. టెస్టుల్లో పంత్‌కు ఇది ఏడో శతకం. ఇక ఇంగ్లాండ్ గడ్డపై మూడోది.
ఓవర్‌నైట్ స్కోరు 65 పరుగులతో రెండో రోజు ఆటను కొనసాగించిన పంత్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 89 పరుగుల వద్ద సిక్స్‌తో 95 పరుగులకు చేరిన పంత్ ఆ తరువాత సింగిల్స్‌తో 99 పరుగులకు చేరుకున్నాడు.
ENG vs IND : ఇంగ్లాండ్ గడ్డపై తొలి సెంచరీ.. యశస్వి జైస్వాల్ కామెంట్స్ విన్నారా?
BATTING ON 99* AND COMPLETED HIS CENTURY WITH A SIX. 🥶
– Rishabh Pant and his celebration. 🔥pic.twitter.com/0S9KMUvvLu
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2025
99 పరుగుల వద్ద స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ముందుకు వచ్చి ఒంటి చేత్తో సిక్స్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో పంత్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీ చేసిన టీమ్ఇండియా వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఎంఎస్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు.
టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత రెగ్యులర్ వికెట్ కీపర్లు వీరే..
రిషబ్ పంత్ – 7 సెంచరీలు
ఎంఎస్ ధోని – 6 సెంచరీలు
వృద్ధిమాన్ సాహా – 3 సెంచరీలు
🚨 RISHABH PANT HAS MOST HUNDREDS BY AN INDIAN WK BATTER IN TEST HISTORY 🚨 pic.twitter.com/0yAPKvLSgW
— Johns. (@CricCrazyJohns) June 21, 2025