ENG vs IND : కేఎల్ రాహుల్ సెంచ‌రీ..

టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు కేఎల్ రాహుల్ శ‌త‌కంతో చెల‌రేగాడు.

ENG vs IND 1ST Test kl rahul century in second innings

టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు కేఎల్ రాహుల్ శ‌త‌కంతో చెల‌రేగాడు. హెడింగ్లీ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 202 బంతుల్లో రాహుల్ మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. ఇందులో 13 ఫోర్లు ఉన్నాయి. టెస్టుల్లో అత‌డికి ఇది తొమ్మిదో సెంచ‌రీ.

TNPL 2025 : ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి.. ఆఖ‌రి 2 బంతుల్లో సిక్స్‌, ఫోర్ బాది.. అశ్విన్ రియాక్ష‌న్ చూశారా?

ఓవ‌ర్ నైట్ స్కోరు 47 ప‌రుగుల‌తో నాలుగో రోజు ఆట‌ను కొన‌సాగించిన రాహుల్ ఇంగ్లాండ్ బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించాడు. త‌న‌దైన శైలిలో ప‌రుగులు రాబ‌ట్టాడు. మంచి బంతుల‌ను గౌర‌విస్తూనే చెత్త బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌ర‌లించాడు. గిల్ ఔటైన స‌మ‌యోచితంగా బ్యాటింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 42 ప‌రుగుల వ‌ద్ద ఔటైనా రెండో ఇన్నింగ్స్‌లో మూడు అంకెల స్కోరు అందుకున్నాడు.

ప్ర‌స్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 62 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 234-3 గా ఉంది. కేఎల్ రాహుల్ (100), రిష‌బ్ పంత్ (82) క్రీజులో ఉన్నారు. భార‌త్‌ 239 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.