TNPL 2025 : ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించిన వరుణ్ చక్రవర్తి.. ఆఖరి 2 బంతుల్లో సిక్స్, ఫోర్ బాది.. అశ్విన్ రియాక్షన్ చూశారా?
తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రవిచంద్రన్ అశ్విన్ సారథ్యంలోని దిండిగుల్ డ్రాగన్స్ జట్టు అదరగొడుతోంది

TNPL 2025 Ashwin gets emotional after Varun Chakravarthy hits six and four off last 2 balls
తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రవిచంద్రన్ అశ్విన్ సారథ్యంలోని దిండిగుల్ డ్రాగన్స్ జట్టు అదరగొడుతోంది. మూడో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం సేలమ్ స్పార్టన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో సేలమ్ స్పార్టన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సేలమ్ బ్యాటర్లలో నిధీశ్ రాజగోపాల్ (47 బంతుల్లో 74 పరుగులు) హాఫ్ సెంచరీ బాదాడు. రాజేంద్రన్ (35), సన్నీ సంధు (25) పర్వాలేదనిపించారు. దిండిగుల్ డ్రాగన్స్ బౌలర్లలో కెప్టెన్ అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. సందీప్ వారియర్, కార్తీక్ శరణ్, వరుణ్ చక్రవర్తి తలా ఓ వికెట్ పడగొట్టారు.
Ishan Kishan : కౌంటీ క్రికెట్‌లో అదరగొట్టిన ఇషాన్ కిషన్.. మెరుపు హాఫ్ సెంచరీ..
VARUN CHAKARAVARTHY, THE FINISHER IN TNPL…!!!
– Dindigul needed 7 from 2 balls then Varun smashed 6 & 4 🤯pic.twitter.com/HOMpyK8U2W
— Johns. (@CricCrazyJohns) June 23, 2025
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిండిగుల్ డ్రాగన్స్ బరిలోకి దిగింది. అశ్విన్ (14 బంతుల్లో 36 పరుగులు), హన్నీ సైనీ (35), శివమ్ సింగ్ (34), జయంత్ (25), విమల్ కుమార్ (24) రాణించడంతో లక్ష్యం దిశగా దూసుకువెళ్లింది. అయితే.. ఓ వైపు వికెట్లు పడడంతో దిండిగుల్ విజయానికి ఆఖరి 11 బంతుల్లో 20 పరుగులు అవసరం అయ్యాయి. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ దశలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి క్రీజులోకి వచ్చాడు.
ఇక ఆఖరి రెండు బంతుల్లో 7 పరుగులు అవసరం కాగా.. వరుణ్ చక్రవర్తి సిక్స్, ఫోర్ బాది తన జట్టును గెలిపించాడు. మొత్తంగా వరుణ్ 5 బంతుల్లో 13 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాదాపుగా ఓటమి ఖాయమైన మ్యాచ్‌లో విజయం సాధించడంతో అశ్విన్ బావోద్వేగానికి గురైయ్యాడు. కాసేపు తలవంచుకుని మౌనంగా ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.