Ishan Kishan : కౌంటీ క్రికెట్‌లో అదరగొట్టిన ఇషాన్ కిషన్.. మెరుపు హాఫ్ సెంచరీ..
టీమ్ఇండియా ఆటగాడు ఇషాన్ కిషన్ కౌంటీ క్రికెట్‌లో అదరగొట్టాడు.

Ishan Kishan Shines On County Debut Smashes 87 Runs
టీమ్ఇండియా ఆటగాడు ఇషాన్ కిషన్ కౌంటీ క్రికెట్‌లో అదరగొట్టాడు. అరంగ్రేట మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో రాణించాడు. నాటింగ్‌హామ్‌షైర్ తరుపున ఆడుతూ కేవలం 57 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. యార్క్‌షైర్‌తో మ్యాచ్‌లో మొత్తంగా ఇషాన్ 94 బంతులు ఎదుర్కొన్నాడు. 11 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 87 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో నాటింగ్‌హామ్‌షైర్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓ దశలో 186-2 పటిష్టంగా ఉండగా.. స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయి 253-5 స్థితిలో నిలిచింది. ఈ సమయంలో క్రీజులోకి అడుగుపెట్టిన ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశాడు. వేగంగా పరుగులు రాబట్టాడు.
Sourav Ganguly : సౌరవ్ గంగూలీ బయోపిక్.. షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మాజీ కెప్టెన్..
ISHAN KISHAN SCORED 87 RUNS ON HIS COUNTY DEBUT 🫡
– He is making each & every opportunity count. pic.twitter.com/lA8k3gaA46
— Johns. (@CricCrazyJohns) June 23, 2025
రెండు మ్యాచ్‌ల కోసమే..
దక్షిణాప్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కైల్ వెర్రెయిన్ జాతీయ జట్టుకు ఆడేందుకు వెళ్లగా అతడి స్థానంలో కేవలం రెండు మ్యాచ్‌లు ఆడేందుకు నాటింగ్‌హామ్‌షైర్ ఇషాన్ కిషన్‌తో ఒప్పందం చేసుకుంది. కాగా.. గతేడాది నిబంధనలు ఉల్లఘించి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన ఇషాన్.. తిరిగి ఈ ఏడాది తన కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నాడు.
ENG vs IND : గిల్ ఇలా చేశావేంటి.. ఆదుకుంటావనుకుంటే.. వికెట్లపైకి ఆడుకున్నావ్.. వీడియో వైరల్
తాజాగా కౌంటీలో ఇషాన్ ఇన్నింగ్స్ చూస్తుంటే.. అతడు జాతీయ జట్టులో స్థానమే లక్ష్యంగా ఆడుతున్నట్లు కనిపిస్తోంది.