Sourav Ganguly : సౌర‌వ్ గంగూలీ బయోపిక్‌.. షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మాజీ కెప్టెన్‌..

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ జీవితం త్వరలో వెండితెరపైకి రానున్న విషయం తెలిసిందే

Sourav Ganguly : సౌర‌వ్ గంగూలీ బయోపిక్‌.. షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మాజీ కెప్టెన్‌..

sourav ganguly biopic

Updated On : June 23, 2025 / 4:59 PM IST

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ జీవితం త్వరలో వెండితెరపైకి రానున్న విషయం తెలిసిందే బాలీవుడ్ న‌టుడు రాజ్‌కుమార్‌ రావు ఈ చిత్రంలో గంగూలీగా క‌నిపించ‌నున్నాడు. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధి గంగూలీ కీల‌క అప్‌డేట్‌ను ఇచ్చాడు.

ఓ ఆంగ్ల మీడియాతో గంగూలీ మాట్లాడుతూ.. త‌న బ‌యోపిక్ సినిమా షూటింగ్ 2026 జ‌న‌వ‌రిలో ప్రారంభం కానున్న‌ట్లు వెల్ల‌డించాడు. ప్రీ-ప్రొడక్షన్, స్క్రిప్టింగ్, కథ రాయ‌డానికి చాలా సమయం పడుతుందని, అయితే.. షూటింగ్‌కు ఎక్కువ సమయం పట్టదని వెల్ల‌డించాడు.

ENG vs IND : గిల్ ఇలా చేశావేంటి.. ఆదుకుంటావ‌నుకుంటే.. వికెట్ల‌పైకి ఆడుకున్నావ్‌.. వీడియో వైర‌ల్‌

విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో రానున్న ఈ సినిమాను లవ్‌ రంజన్‌ నిర్మించనున్నారు.

భారత జట్టులో పోరాట స్ఫూర్తిని నింపడం, విదేశాలలో విజ‌యాల‌ను అందించిన కెప్టెన్‌గా గంగూలీ ఎంతో ఖ్యాతి గ‌డించాడు. అత‌డు 49 టెస్టుల‌కు సార‌థ్యం వ‌హించ‌గా.. ఇందులో 21 మ్యాచ్‌ల్లో భార‌త్ గెలిచింది. మ‌రో 13 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 15 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. విదేశాల్లో అత్య‌ధిక విజ‌యాలు (11 గెలుపులు) అందించిన కెప్టెన్‌గా గంగూలీ రికార్డుల‌కు ఎక్కాడు. ఈ రికార్డును మ‌రో దిగ్గ‌జ ఆట‌గాడు విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు.

మ‌రిన్ని సెంచ‌రీలు చేయాల్సింది..
త‌న అంత‌ర్జాతీయ కెరీర్‌లో గంగూలీ 38 శ‌త‌కాలు బాదాడు. అయితే.. తాను మ‌రిన్ని సెంచ‌రీలు చేయాల్సి ఉంద‌ని గంగూలీ అభిప్రాయ‌ప‌డ్డాడు.

113 టెస్టులు, 311 వ‌న్డేల్లో క‌లిపి 18,575 ప‌రుగులు చేశాడు. త‌న కెరీర్‌లో చాలా సార్లు 80ల్లో, 90ల్లో ఔట్ అయ్యాడు. వాటిని సెంచ‌రీలుగా మ‌లిస్తే బాగుండేద‌న్నాడు. దాదాపు 30 సార్లు 80ల్లో, 90ల్లో ఔట్ అయ్యాడు. ఒక‌వేళ వాటిని శ‌త‌కాలుగా మ‌లిచి ఉంటే.. 50కి పైగా సెంచ‌రీలు సాధించి ఉండేవాడు.

Prithvi Shaw : పృథ్వీ షా కీల‌క నిర్ణ‌యం.. నా దారి నేను చూసుకుంటా.. మీ త‌రుపున ఆడేదే లేదు.. ఎన్ఓసీ ఇచ్చేయండి..

ఇక ఒంటరిగా ఉన్న‌ప్పుడు త‌న పాత ఇన్నింగ్స్ వీడియోలు చూస్తాన‌ని గంగూలీ తెలిపాడు. ‘అరెరె నేను 70ల్లో కూడా ఔట్ అయ్యాను అని అనుకుంటాను. నేను సెంచ‌రీ చేసి ఉండాలి. కానీ దానిని మార్చ‌లేం క‌దా.’ అని గంగూలీ అన్నాడు.