ENG vs IND : గిల్ ఇలా చేశావేంటి.. ఆదుకుంటావనుకుంటే.. వికెట్లపైకి ఆడుకున్నావ్.. వీడియో వైరల్
తొలి ఇన్నింగ్స్‌లో శతకం సాధించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో ఇన్నింగ్స్‌లో విఫలం అయ్యాడు.

ENG vs IND 1st test Shubman Gill stumps rattled by Brydon Carse
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య హెడింగ్లీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఓవర్ నైట్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది.
తొలి ఇన్నింగ్స్‌లో శతకం సాధించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో ఇన్నింగ్స్‌లో విఫలం అయ్యాడు. 16 బంతులు ఆడిన ఈ స్టార్ బ్యాటర్ కేవలం 8 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. నాలుగో రోజు ఆట ప్రారంభమైన తొలి ఓవర్ ఆఖరి బంతిని బ్రైడాన్ కార్స్ బౌలింగ్‌లో బంతిని వికెట్ల పైకి ఆడుకుని బౌల్ట్ అయ్యాడు.
తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగుల ఆధిక్యాన్నే సాధించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు సాధించి ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలని ఆశిస్తోంది. ఈ క్రమంలో కెప్టెన్ గిల్ బాధ్యతాయుతంగా ఆడి ఓ పెద్ద ఇన్నింగ్స్ ఆడుతాడని ఆశించగా అతడు మాత్రం నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నాడు.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) June 23, 2025
ENG vs IND : టెస్టుల్లో రిషబ్ పంత్ అరుదైన ఘనత..
మరోవైపు ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పంత్ తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లకు స్కోరు 112/3. కేఎల్ రాహుల్ (52), రిషబ్ పంత్ (15) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 118 పరుగుల ఆధిక్యంలో ఉంది.