టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఇంగ్లాండ్ గడ్డ పై అదరగొడుతున్నాడు. తొలి టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన పంత్ రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
కాగా.. పంత్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తరువాత సోమర్‌సాల్ట్ కొట్టి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన తరువాత పంత్ మరోసారి అదే విధంగా సెలబ్రేట్ చేసుకుంటాడని అంతా భావించారు. అటు స్టాండ్స్‌లో ఉన్న భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ కూడా అలాగే సెలబ్రేట్ చేసుకోమంటూ పంత్‌కు సంజ్ఞలు చేశాడు.
SUNIL GAVASKAR ASKING PANT TO CELEBRATE 🥹📷pic.twitter.com/ODbAhiBxpX
— Armita Jain 🇮🇳 (@armitaJain) June 23, 2025
ఇక పంత్ కూడా తొలుత సోమర్‌సాల్ట్ కొట్టేందుకు సిద్ధం అయ్యాడు కానీ ఆ తరువాత తన మనసును మార్చుకున్నాడు. చూపుడు వేలు, బొటన వేలిని కలిపి సున్నాలా చేసి అందులోంచి చూశాడు.
ఇక గవాస్కర్‌కు సంజ్ఞకు రిప్లై సైతం ఇచ్చాడు. మరోసారి అలా ఖచ్చితంగా చేస్తానని మాట ఇచ్చాడు. బహుళా ఈ సిరీస్‌లో మరోసారి అని చెప్పినట్లుగా అనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.