Rishabh Pant : చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన ఏకైక భారత వికెట్ కీపర్..
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు.

Rishabh Pant creates history becomes first Indian wicketkeeper to score centuries in both innings in a test
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఓ టెస్టు మ్యాచ్‌లో వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు బాదిన తొలి భారత వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన పంత్ రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు.
ఓవరాల్‌గా తీసుకుంటే రెండో వికెట్ కీపర్‌గా రికార్డులకు ఎక్కాడు. జింబాబ్వే ఆటగాడు ఆండీ ప్లవర్ మాత్రమే పంత్ కన్నా ముందు ఈ ఘనత సాధించాడు.
ఓ టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన వికెట్ కీపర్లు వీరే..
ఆండీ ప్లవర్ (జింబాబ్వే) – 2001లో దక్షిణాఫ్రికా పై 142 & 199 *
రిషబ్ పంత్ (భారత్) – 2025లో ఇంగ్లాండ్ పై 134 & 118
ఇక ఓ టెస్టు మ్యాచ్‌లో వరుసగా రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రిషబ్ పంత్ చోటు సంపాదించుకున్నాడు. విజయ్ హజారే, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రోహిత్ శర్మ లు పంత్ కన్నా ముందే ఈ ఘనత సాధించారు.
ఓ టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
విజయ్ హజారే,
సునీల్ గవాస్కర్ (మూడు సార్లు),
రాహుల్ ద్రవిడ్ (రెండుసార్లు),
విరాట్ కోహ్లీ,
అజింక్య రహానే,
రోహిత్ శర్మ
రిషబ్ పంత్