Rishabh Pant creates history becomes first Indian wicketkeeper to score centuries in both innings in a test
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఓ టెస్టు మ్యాచ్‌లో వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు బాదిన తొలి భారత వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన పంత్ రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు.
ఓవరాల్‌గా తీసుకుంటే రెండో వికెట్ కీపర్‌గా రికార్డులకు ఎక్కాడు. జింబాబ్వే ఆటగాడు ఆండీ ప్లవర్ మాత్రమే పంత్ కన్నా ముందు ఈ ఘనత సాధించాడు.
ఓ టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన వికెట్ కీపర్లు వీరే..
ఆండీ ప్లవర్ (జింబాబ్వే) – 2001లో దక్షిణాఫ్రికా పై 142 & 199 *
రిషబ్ పంత్ (భారత్) – 2025లో ఇంగ్లాండ్ పై 134 & 118
ఇక ఓ టెస్టు మ్యాచ్‌లో వరుసగా రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రిషబ్ పంత్ చోటు సంపాదించుకున్నాడు. విజయ్ హజారే, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రోహిత్ శర్మ లు పంత్ కన్నా ముందే ఈ ఘనత సాధించారు.
ఓ టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
విజయ్ హజారే,
సునీల్ గవాస్కర్ (మూడు సార్లు),
రాహుల్ ద్రవిడ్ (రెండుసార్లు),
విరాట్ కోహ్లీ,
అజింక్య రహానే,
రోహిత్ శర్మ
రిషబ్ పంత్