ENG vs IND : ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు.. టీమ్ఇండియా ఫ‌స్ట్ బ్యాటింగ్‌.. తెలుగోడికి చోటు.. వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఇన్‌, బుమ్రా ఔట్‌..

ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభ‌మైంది.

ENG vs IND 2nd Test

ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. హెడింగ్లీ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయిన భార‌త్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను స‌మం చేయాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో తుది జట్టులో మూడు మార్పులు చేసింది.

వ‌ర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. అత‌డి స్థానంలో ఆకాశ్ దీప్‌ను తీసుకుంది. తొలి టెస్టులో ఘోరంగా విఫ‌ల‌మైన శార్దూల్ ఠాకూర్ స్థానంలో తెలుగు ఆట‌గాడు నితీశ్ కుమార్ రెడ్డికి తుది జ‌ట్టులో స్థానం ద‌క్కింది. లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో బ్యాటింగ్‌కు సైతం ఉప‌యోగ‌ప‌డుతాడ‌ని స్పిన్ ఆల్‌రౌండ‌ర్ గా వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కు ఛాన్స్ ఇచ్చింది. దీంతో కుల్దీప్ యాద‌వ్‌కు మ‌రోసారి నిరాశే ఎదురైంది. అరంగ్రేట మ్యాచ్‌లో విఫ‌ల‌మైన సాయి సుద‌ర్శ‌న్ పై వేటు ప‌డింది.

ENG vs IND : రెండో టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న ఎడ్జ్‌బాస్ట‌న్‌లో టీమ్ఇండియాకు ఇంత ఘోరమైన రికార్డు ఉందా..?

భారత తుది జ‌ట్టు..
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్‌), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఇంగ్లాండ్ తుది జ‌ట్టు..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్‌), జామీ స్మిత్(వికెట్ కీప‌ర్‌), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.