ENG vs IND : రెండో టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న ఎడ్జ్‌బాస్టన్‌లో టీమ్ఇండియాకు ఇంత ఘోరమైన రికార్డు ఉందా..?
ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టీమ్ఇండియా రికార్డులు ఏమంత గొప్పగా లేవు.

Do you know team India test record at Edgbaston
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా నేటి నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టులో ఓడిపోయిన భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని భావిస్తోంది. అయితే.. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టీమ్ఇండియా రికార్డులు ఏమంత గొప్పగా లేవు. ఈ విషయం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ మైదానంలో భారత్ ఇప్పటి వరకు 8 టెస్టులు ఆడింది. ఇందులో ఒక్క మ్యాచ్‌ను డ్రా చేసుకోగా మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఇక డ్రా చేసుకున్న మ్యాచ్ కూడా 1986లో జరిగింది. 1967 నుంచి ఈ మైదానంలో భారత్ ఆడుతుండగా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. ఇక చివరిసారిగా 2002లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
Richa Ghosh : చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా వికెట్ కీపర్ రిచా ఘోష్..
ఇక ఈ మైదానంలో ఇప్పటి వరకు 56 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ముందుగా బౌలింగ్ చేసిన జట్లు 23 మ్యాచ్‌ల్లో, బ్యాటింగ్ చేసిన జట్లు 18 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. మరో 15 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
వర్షం ముప్పు..
ఇక ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. అక్యువెదర్ నివేదిక ప్రకారం.. తొలి రోజు వర్షం పడే అవకాశాలు 82 శాతం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చు. మ్యాచ్ జరిగే సమయంలో ఆకాశం మేఘావృతమై ఉండొచ్చునని తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటే అప్పుడు పిచ్ పేసర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది.