Richa Ghosh : చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా వికెట్ కీపర్ రిచా ఘోష్..
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది.

richa ghosh scripts HISTORY massive T20 world record
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక స్ట్రైక్‌రేటుతో 1000 పరుగులు మైలురాయిని చేరుకున్న క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో రిచా ఈ ఘనత సాధించింది. 140కి పైగా స్ట్రైక్‌రేటుతో ఆమె ఈ ఘనత సాధించింది.
అంతేకాదండోయ్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వెయ్యి పరుగులను అత్యంత వేగంగా (బంతుల పరంగా) పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్‌గా నిలిచింది. రిచా 702 బంతుల్లో వెయ్యి పరుగులు సాధించగా లూసీ బార్నెట్ 700 బంతుల్లో ఈ మైలురాయిని సాధించి అగ్రస్థానంలో నిలిచింది.
Milestone Unlocked 🔓
1⃣0⃣0⃣0⃣ T20I runs and counting for Richa Ghosh 👏
Updates ▶️ https://t.co/j4IYcst6GO#ENGvIND | #TeamIndia pic.twitter.com/GdzyxMBtTO
— BCCI Women (@BCCIWomen) July 1, 2025
16 ఏళ్ల వయసులో (2020లో) రిచా ఘోష్ టీమ్ఇండియా తరుపున టీ20ల్లో అరంగ్రేటం చేసింది. ఇప్పటి వరకు 64 మ్యాచ్‌లు ఆడింది. 53 ఇన్నింగ్స్‌ల్లో 27.81 సగటుతో 1029 పరుగులు సాధించింది. ఇందులో రెండు అర్థశతకాలు ఉన్నాయి.
మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ స్ట్రైక్‌రేటుతో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్లు వీరే..
* రిచా ఘోష్ (భారత్) – 143.11 స్ట్రైక్‌రేటుతో 1029 రన్స్
* లూసీ బార్నెట్ (ఐల్ ఆఫ్ మ్యాన్) – 139.69 స్ట్రైక్‌రేటుతో 1172 రన్స్
* తాహిలా మెగ్రాత్ (ఆస్ట్రేలియా) – 132.94 స్ట్రైక్‌రేటుతో 132.94 రన్స్
* క్లో టైరాన్ (దక్షిణాఫ్రికా) – 132.81 స్ట్రైక్‌రేటుతో 1283 రన్స్
* అలీసా హేలీ (ఆస్ట్రేలియా) – 129.79 స్ట్రైక్‌రేటుతో 3208 రన్స్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈమ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (63; 41 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), అమన్‌జోత్ కౌర్ (63 నాటౌట్; 40 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. రిచా ఘోష్ (32 నాటౌట్; 20 బంతుల్లో 6 ఫోర్లు) వేగంగా ఆడింది.
ENG vs IND : ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ముందు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లీష్ బ్యాటర్లలో టామీ బీమౌంట్ (54) హాఫ్ సెంచరీ చేసింది. ఎమీ జోన్స్ (32), సోఫీ ఎక్లిస్టోన్ (35) రాణించారు. భారత బౌలర్లలో శ్రీ చరణి రెండు వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్ చెరో వికెట్ తీశారు.