ENG vs IND : ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ముందు కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ కీల‌క వ్యాఖ్య‌లు..

కీల‌క మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ భార‌త టాప్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్లు ఓ విజ్ఞ‌ప్తి చేశాడు.

ENG vs IND : ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ముందు కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ కీల‌క వ్యాఖ్య‌లు..

ENG vs IND Shubman Gill comments viral ahead of 2nd test

Updated On : July 2, 2025 / 9:22 AM IST

అండ‌ర్స‌న్‌-టెండూల్క‌ర్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా నేటి నుంచి భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్లు రెండో టెస్టు మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. తొలి టెస్టులో ఓడిన భార‌త్ ఈ మ్యాచ్‌లో ఎలాగైన విజ‌యం సాధించి సిరీస్‌ను స‌మం చేయాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఈ కీల‌క మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ భార‌త టాప్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ల‌కు ఓ విజ్ఞ‌ప్తి చేశాడు.

తొలి టెస్టు మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్‌ల్లో భార‌త లోయ‌ర్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్లు ప‌రుగులు చేయ‌కుండానే వికెట్లు స‌మ‌ర్పించుకున్నారు. దీంతో భార‌త్ అనుకున్న‌దానికంటే త‌క్కువ ప‌రుగులే చేయ‌గ‌లిగింది. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని స్పెష‌లిస్ట్ బ్యాట‌ర్లు రెండో టెస్టులో మ‌రింత బాధ్య‌త‌ తీసుకుని ఆడాల‌ని గిల్ కోరాడు.

ENG vs IND : ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు.. ఒక్క మ్యాచ్‌కే త్రిశ‌త‌క వీరుడు ప‌రిమితం.. సాయి సుద‌ర్శ‌న్‌కు మ‌రో ఛాన్స్‌.. కుల్దీప్ యాద‌వ్ ఇన్‌..!

జట్టులో ఉన్న సమస్యలను గిల్ అంగీకరించాడు. టెస్టు క్రికెట్‌లో ఇత‌ర జ‌ట్టలోని లోయ‌ర్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్లు ప‌రుగులు చేసిన‌ట్లుగా టీమ్ఇండియా లోయ‌ర్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్లు చేయ‌లేక‌పోతున్న విష‌యాన్ని ఒప్పుకున్నాడు. ఇక్క‌డ ఇంకో విష‌యం గ‌మనించాల‌ని చెప్పాడు. తాను 147 ప‌రుగుల వ‌ద్ద బ్యాటింగ్ చేస్తూ వికెట్ స‌మ‌ర్పించుకోవ‌డాన్ని ప్ర‌స్తావించాడు.

తాను ఇంకాస్త జాగ్ర‌త్త‌గా ఆడితే పంత్ తో క‌లిసి మ‌రో 50 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పేవాడిన‌ని చెప్పుకొచ్చాడు. ‘మంచి బంతికి ఔటైతే ఫ‌ర్వాలేద‌ని, కానీ క్రీజులో కుదురుకున్నాక బ్యాటింగ్ ఆర్డ‌ర్ డెప్త్ లేక‌పోతే టాప్ ఆర్డ‌ర్ ఇంకొంచెం ఎక్కువ బాధ్య‌త తీసుకుని ఆడాలి.’ అని గిల్ అన్నాడు.

Yashasvi Jaiswal : మ‌న‌సు మార్చుకున్న య‌శ‌స్వి జైస్వాల్‌.. ఇక ముంబైకే..

బుమ్రా పై నిర్ణ‌యం అప్పుడే..

రెండో టెస్టులో బుమ్రా ఆడ‌తాడా లేదా అన్న దానిపై సందిగ్ధ‌త కొన‌సాగుతోంది. అత‌డు మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడ‌ని ఇప్ప‌టికే జ‌ట్టు మేనేజ్‌మెంట్ ప్ర‌క‌టించింది. అయితే.. ఆడ‌తాడా లేదా అన్న విష‌యాన్ని వెల్ల‌డించ‌లేదు. ఈ విష‌యం పై గిల్ స్పందిస్తూ.. అత‌డి వ‌ర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు చెప్పాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు పిచ్‌ను ప‌రిశీలించిన త‌రువాత బుమ్రా విష‌యంలో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పాడు. ఇంగ్లాండ్‌ను రెండు సార్లు ఆలౌట్ చేయ‌డంతో పాటు భారీగా ప‌రుగులు చేసే జ‌ట్టు కూర్పు కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిపాడు. గిల్ చెబుతున్న దాన్ని బ‌ట్టి తుది జ‌ట్టులో రెండు మూడు మార్పులు జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి