ENG vs IND : ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు.. ఒక్క మ్యాచ్‌కే త్రిశతక వీరుడు పరిమితం.. సాయి సుదర్శన్‌కు మరో ఛాన్స్.. కుల్దీప్ యాదవ్ ఇన్..!
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

India vs England 2nd Test Karun Nair and Shardul out Kuldeep in
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గెలిచి జోష్‌లో ఉన్న ఇంగ్లాండ్ అదే ఉత్సాహన్ని కంటిన్యూ చేయాలని భావిస్తోంది. మరోవైపు భారత్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలగా ఉంది. అయితే.. ఈ మ్యాచ్ తుది జట్టు కూర్పు టీమ్ఇండియా మేనేజ్‌మెంట్‌కు సవాల్‌గా మారింది.
ఇద్దరు స్పిన్నర్లను తీసుకోవాలా లేదా ఒక్కరితోనే బరిలోకి దిగాలా అన్నది సందిగ్ధత నెలకొంది. ఇద్దరిని తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక తొలి టెస్టులో ఏమంత ప్రభావం చూపని ఆల్‌రౌండర్ శార్దూల్‌ను పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అతడి స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డిని ఆడించాలని గంభీర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Yashasvi Jaiswal : మనసు మార్చుకున్న యశస్వి జైస్వాల్.. ఇక ముంబైకే..
రీ ఎంట్రీలో సత్తా చాటని త్రిశతక వీరుడు కరుణ్ నాయర్ పై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎనిమిదేళ్ల తరువాత జట్టులో చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్ హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ తొలి టెస్టులో డకౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు అరంగ్రేట మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయిన సాయి సుదర్శన్‌కు కెప్టెన్ గిల్ అండ పుష్కలంగా ఉంది. దీంతో అతడికి మరో అవకాశం దక్కొచ్చు.
మ్యాచ్‌కు ముందు నిర్వహించిన చివరి ప్రాక్టీస్ సెషన్ కూడా ద్వారా ఈ విషయం అర్థమవుతోంది. సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లు ఫస్ట్ సిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ కనిపించారు. తొలి టెస్టులో నాయర్ ఈ స్థానంలో ఫీల్డింగ్ చేశాడు. అయితే.. చివరి ప్రాక్టీస్ సెషన్‌లో సాయి సుదర్శన్ ఫస్ట్ స్లిప్‌లో ఎక్కువగా క్యాచ్‌లు పట్టుకుంటూ కనిపించాడు. కొన్నిసార్లు గిల్, సాయి సుదర్శన్‌లు పొజిషన్లు కూడా మార్చుకున్నారు. గౌతమ్ గంభీర్ వీరిద్దరి ప్రాక్టీస్ సెషన్‌ను చాలా దగ్గరగా ఉండి గమనించాడు. దీన్ని బట్టి చూస్తే రెండో టెస్టులో కరుణ్ నాయర్ కు స్థానం లేనట్లుగా అర్థమవుతోంది. సాయి సుదర్శన్‌కు మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
బుమ్రాకు విశ్రాంతి ఇస్తే ఆకాశ్ దీప్ లేదా అర్ష్‌దీప్ సింగ్‌లలో ఒకరిని పేస్ అటాక్‌లో చేర్చబడే అవకాశం ఉంది. బుమ్రా ఆడకపోతే మహ్మద్ సిరాజ్ మార్గనిర్దేశ్యంలోనే టీమ్ఇండియా పేసర్లు ఆడనున్నారు. ఇద్దరు సిన్నర్లు తప్పనిసరి అని భావిస్తుండగా.. ఓ స్పిన్నర్‌గా జడేజా ఉండగా.. రెండో స్పిన్నర్‌గా కుల్‌దీప్, సుందర్‌లలో ఎవరిని ఆడిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కావాలని భావిస్తే కుల్దీప్ యాదవ్‌ను.. లేదు.. బ్యాటింగ్‌లో కూడా ఓ చేయి వేయాలంటే వాషింగ్టన్ సుందర్ ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. అయితే.. జట్టు మేనేజ్‌మెంట్ కుల్దీప్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.