Shreyas Iyer : ఇంత‌క‌న్నా ఏం చేయాలి.. శ్రేయ‌స్ అయ్య‌ర్ తండ్రి ఆవేద‌న‌..

ఆసియాక‌ప్ 2025లో శ్రేయ‌స్ అయ్య‌ర్‌(Shreyas Iyer)కు చోటు క‌ల్పించ‌క‌పోవ‌డం పై అత‌డి తండ్రి సంతోష్ అయ్య‌ర్ స్పందించారు.

Shreyas Iyer : ఇంత‌క‌న్నా ఏం చేయాలి.. శ్రేయ‌స్ అయ్య‌ర్ తండ్రి ఆవేద‌న‌..

Shreyas Iyers Father Breaks Silence On Asia Cup Snub

Updated On : August 21, 2025 / 3:56 PM IST

Shreyas Iyer : యూఏఈ వేదిక‌గా సెప్టెంబ‌ర్ 9 నుంచి ఆసియా క‌ప్ 2025 ప్రారంభంకానుంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనే భార‌త జ‌ట్టును ఇటీవ‌లే బీసీసీఐ ప్ర‌క‌టించింది. 15 మంది స‌భ్యులు గ‌ల ఈ బృందంలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు (Shreyas Iyer) చోటు ద‌క్క‌లేదు.

ఈ నేప‌థ్యంలో సెలక్టర్లు, మేనేజ్‌మెంట్‌ తీరుపై ఫ్యాన్స్‌తో మాజీలు క్రికెట‌ర్లు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇక జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌డం పై ఇంత‌వ‌ర‌కు కూడా శ్రేయ‌స్ అయ్య‌ర్ ఎక్క‌డా స్పందించ‌లేదు.

కాగా.. ఆసియాక‌ప్ 2025లో శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు చోటు క‌ల్పించ‌క‌పోవ‌డం పై అత‌డి తండ్రి సంతోష్ అయ్య‌ర్ స్పందించారు. త‌న కొడుకు ఇంత‌క‌న్నా ఏమీ చేయాలో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌న్నాడు. ప్ర‌తి ఏడాది అయ్య‌ర్ ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడుతున్నాడు. కెప్టెన్‌గా ఢిల్లీ, పంజాబ్‌, కోల్‌క‌తాల‌ను ఫైన‌ల్స్‌కు చేర్చాడు. కేకేఆర్‌కు అయితే టైటిల్ అందించాడు. కెప్టెన్‌గా గొప్ప విజ‌యాలు సాధించాడు. బ్యాట‌ర్‌గానూ రాణించాడు. అని చెప్పుకొచ్చాడు.

Rohit Sharma : ఆస్ట్రేలియా టూర్‌కు ముందు రోహిత్ శ‌ర్మ కీల‌క నిర్ణ‌యం..!

అందుక‌ని త‌న కొడుకును టీమ్ఇండియా కెప్టెన్ ను చేయ‌మ‌ని తాను అడ‌గ‌డం లేద‌న్నాడు. క‌నీసం జ‌ట్టులోనైనా చోటు ఇవ్వాల్సింది అని మాత్ర‌మే అడుగుతున్నాన‌న్నాడు.

జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోయినా కూడా అయ్య‌ర్‌ ముఖంలో ఎలాంటి హావ భావాలు క‌నిపించ‌వ‌న్నాడు. నాకు అదృష్టం లేదు అని మాత్ర‌మే అంటాడ‌న్నారు.

శ్రేయ‌స్ ఎవ్వ‌రిని నిందించ‌డ‌ని, అయితే.. లోలోప‌లా జ‌ట్టుకు ఎంపిక కాలేక‌పోయాన‌న్న బాధ ప‌డుతుంటాడ‌ని అని సంతోశ్‌ అయ్యర్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా మాట్లాడుతూ చెప్పాడు.

Ajinkya Rahane : అజింక్యా ర‌హానే కీల‌క నిర్ణ‌యం.. ఇక చాలు.. దిగిపోతున్నా..

ఇదిలా ఉంటే.. శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ త‌రుపున 14 టెస్టులు, 70 వ‌న్డేలు, 51 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 36.9 స‌గ‌టుతో 811 ప‌రుగులు చేశాడు.వ‌న్డేల్లో 48.2 స‌గుతో 2845 ప‌రుగులు సాధించాడు. ఇక టీ20ల్లో 30.7 స‌గ‌టుతో 1104 ప‌రుగులు చేశాడు. మొత్తంగా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 6 సెంచ‌రీలు చేశాడు.