ENG vs IND 4th test England opt to bowl
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఇప్పటికే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలగా ఉంది. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఇంగ్లాండ్ జట్టులో ఒక్క మార్పు చోటు చేసుకుంది. గాయపడిన స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో లియామ్ డాసన్ వచ్చాడు.
ENG vs IND : భారత్‌తో నాలుగో టెస్ట్.. స్లెడ్జింగ్ పై బెన్‌స్టోక్స్ కామెంట్స్..
ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.
అటు భారత తుది జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. రీఎంట్రీలో మూడు మ్యాచ్‌ల్లో విఫలం అయిన కరుణ్ నాయర్‌ను పక్కన పెట్టేశారు. అతడి స్థానంలో సాయి సుదర్శన్‌కు చోటు దక్కింది. ఇక గాయాలతో ఆకాశ్ దీప్, నితీశ్ రెడ్డి దూరం కాగా.. వారి స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కాంబోజ్ జట్టులోకి వచ్చారు. వీరిలో ఈ మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అన్షుల్ కాంబోజ్ అరంగ్రేటం చేస్తున్నాడు.
భారత తుది జట్టు..
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అన్షుల్ కాంబోజ్.
Here’s #TeamIndia‘s Playing XI for the Fourth Test 🙌
Anshul Kamboj makes his Debut 👏👏
Updates ▶️ https://t.co/L1EVgGu4SI#ENGvIND pic.twitter.com/bR2QO2eT8H
— BCCI (@BCCI) July 23, 2025