ENG vs IND 5th test Shubman Gill Eye on Sunil Gavaskar 54 years old record
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌ల్లో 8 ఇన్నింగ్స్‌ల్లో 90.25 సగటుతో 722 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
కాగా.. జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఐదో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు శుభ్‌మన్ గిల్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
ENG vs IND : చివరి టెస్టులో భారత్ గెలిచి సిరీస్‌ను సమం చేస్తే.. ట్రోఫీని ఎవరు తీసుకుంటారు?
సునీల్ గవాస్కర్ రికార్డు బ్రేక్..!
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్, యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ల తరువాత ఓ టెస్టు సిరీస్‌లో 700 పరుగులు చేసిన మూడో ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఆఖరి టెస్టు మ్యాచలో గిల్ 53 పరుగులు చేస్తే ఓ టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. 1970/71లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో గవాస్కర్ 774 పరుగులు చేశాడు.
ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
* సునీల్ గవాస్కర్ – 774 పరుగులు (వెస్టిండీస్ పై)
* సునీల్ గవాస్కర్ – 732 పరుగులు (వెస్టిండీస్ పై)
* శుభ్‌మన్ గిల్ – 722 పరుగులు (ఇంగ్లాండ్ పై)
* యశస్వి జైస్వాల్ – 712 పరుగులు (ఇంగ్లాండ్ పై)
* విరాట్ కోహ్టీ – 692 పరుగులు (ఆస్ట్రేలియాపై)
ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ ఇప్పటి వరకు నాలుగు శతకాలు చేశాడు. ఆఖరి మ్యాచ్‌లో సెంచరీ చేస్తే మాత్రం అతడు ఓ అరుదైన ఘనతను అందుకోనున్నాడు. ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా నిలవనున్నాడు. ప్రస్తుతం అతడు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు బ్రాన్ మన్, టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.
ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్లు వీరే..
* డాన్ బ్రాడ్‌మాన్ (ఆస్ట్రేలియా) – 4 సెంచరీలు (1947లో భారత్ పై)
* సునీల్ గవాస్కర్ (భారత్) – 4 సెంచరీలు (1978లో వెస్టిండీస్ పై)
* శుభ్‌మన్ గిల్ (భారత్) – 4 * సెంచరీలు (2025లో ఇంగ్లాండ్ పై )