ENG vs IND : చివరి టెస్టులో భారత్ గెలిచి సిరీస్‌ను సమం చేస్తే.. ట్రోఫీని ఎవరు తీసుకుంటారు?
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది.

If India Win Final Test And Series Ends In Draw Who Will Take Trophy Home
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఆఖరి టెస్టు మ్యాచ్ జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరగనుంది.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని భారత్ భావిస్తోంది. అదే సమయంలో ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 3-1తో లేదంటే డ్రా చేసుకుని 2-1తో సొంతం చేసుకోవాలని భావిస్తోంది.
కాగా.. చివరి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి సిరీస్ 2-2తో సమం అయితే.. అప్పుడు అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఎవరి దగ్గర ఉంటుందన్న ప్రశ్న ఇప్పుడు అభిమానుల మెదడులో ఉంది.
సాధారణంగా ద్వైపాక్షిక్ష టెస్టు సిరీస్‌లోని సంప్రదాయం ప్రకారం.. ఓ సిరీస్ డ్రాగా ముగిస్తే.. మునుపటి (చివరిసారి) ఎడిషన్‌ను గెలుచుకున్న జట్టు ట్రోఫీని నిలుపుకుంటుంది. ప్రస్తుతం జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని గతంలో పటౌడీ ట్రోఫీ అని పిలిచేవారు. 2021లో జరిగిన పటౌడీ ట్రోపీ డ్రాగా ముగిసినప్పటికి 2018లో ఇంగ్లాండ్ గెలవడంతో ఆ జట్టు వద్దే ఉంటూ వస్తోంది.
అయితే.. ప్రస్తుతం ఈ సిరీస్ పేరు మార్చిన సంగతి తెలిసిందే. దీంతో సిరీస్ డ్రా అయితే.. 2021లో లాగానే ఇంగ్లాండ్ వద్దనే ట్రోఫీ ఉండనుందా? లేదంటే పంచుకుంటారా? అన్న దానిపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రస్తుతానికి.. ఈ సిరీస్ డ్రా అయితే.. కొత్త ట్రోఫీ ఎవరి వద్ద ఉంటుందనే నియమాలపై అటు బీసీసీఐ లేదా ఇటు ఈసీబీలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.