ENG vs IND : ఐదో టెస్టులో గెలిచేందుకు ఇంగ్లాండ్ మాస్టర్ ఫ్లాన్.. చెన్నై సూపర్ కింగ్స్ డేంజరస్ ఆల్‌రౌండర్‌కు చోటు..
లండన్‌లోని ఓవల్ వేదికగా జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు సిరీస్‌లోని ఆఖరిదైన ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది.

ENG vs IND 5th Test England announce 15 member squad
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా ముగిసింది. ప్రస్తుతానికి సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇక ఇరు జట్ల మధ్య లండన్‌లోని ఓవల్ వేదికగా జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు సిరీస్‌లోని ఆఖరిదైన ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్ భావిస్తుంది. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో గెలవడం లేదంటే కనీసం డ్రా అయినా చేసుకోవాలని అప్పుడు సిరీస్ తమ సొంతం అవుతుందని ఇంగ్లాండ్ అనుకుంటుంది.
ఈ క్రమంలో భారత్‌తో జరిగే చివరి టెస్టు కోసం ఇంగ్లాండ్ జట్టు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. జట్టులో ఒకే ఒక మార్పు చోటు చేసుకుంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్న స్టార్ ఆల్‌రౌండర్ జామీ ఓవర్టన్‌ను తీసుకుంది.
వాస్తవానికి ఈ సిరీస్‌లోని తొలి రెండు టెస్టులకు ప్రకటించిన 15 మంది సభ్యుల గల బృందంలో జేమీ ఓవర్టన్ ఉన్నాడు. అయితే.. అతడి తుది జట్టులో చోటు దక్కలేదు. చివరి టెస్టు మ్యాచ్‌లోనైనా తుది జట్టులో అతడి చోటు దక్కుతుందో లేదో చూడాలి.
జేమీ ఓవర్టన్ విషయానికి వస్తే.. అతడు తన కెరీర్‌లో ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. 2002లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. ఈ మ్యాచ్‌లో 97 పరుగులు చేసిన అతడు రెండు వికెట్లు తీశాడు. అయినప్పటికి అతడికి మరో టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు.
Rishabh Pant : ఐదో టెస్టుకు దూరమైన రిషబ్ పంత్.. జట్టు కోసం కీలక సందేశం.. అబ్బాయిలు..
కాగా.. అతడి ఫస్ట్ క్లాస్ రికార్డు బాగుంది. 98 మ్యాచ్‌ల్లో 237 వికెట్లు తీశాడు. 2401 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
భారత్‌తో జరిగే 5వ టెస్ట్‌కు ఇంగ్లాండ్ జట్టు ఇదే..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జోరూట్ , హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్.