Rishabh Pant : ఐదో టెస్టుకు దూరమైన రిషబ్ పంత్.. జట్టు కోసం కీలక సందేశం.. అబ్బాయిలు..
ఐదో టెస్టు మ్యాచ్‌కు దూరం అయిన క్రమంలో వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ జట్టుకు ఓ సందేశం ఇచ్చాడు.

ENG vs IND Rishabh Pant sends parting message to Team India
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన చేశారు. ఈ క్రమంలో భారత జట్టు మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ తొలి రోజు భారత ఇన్నింగ్స్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తూ రిషబ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇక రెండో రోజు అతడు బ్యాటింగ్‌కు దిగి నొప్పిని భరిస్తూ హాఫ్ సెంచరీ చేశాడు. అతడు చేసిన 54 పరుగులు జట్టుకు కీలకంగా మారాయి.
అయితే.. గాయంతో ఆఖరి టెస్టు మ్యాచ్‌కు పంత్ దూరం అయ్యాడు. ఈ విషయాన్ని నాలుగో టెస్టు ముగిసిన తరువాత బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా చెప్పేసింది. అతడి స్థానంలో ఎన్ జగదీశన్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
ఇక ఐదో టెస్టు మ్యాచ్‌కు దూరం అయిన క్రమంలో వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ జట్టుకు ఓ సందేశం ఇచ్చాడు. ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించాలని పిలుపునిచ్చాడు.
జట్టుకు తాను ఇచ్చే ఏకైక సందేశం ఏంటంటే.. అబ్బాయిలు మనం గెలుద్దాం.. దేశం కోసం చేద్దాం అని పంత్ అన్నాడు.
వ్యక్తిగత లక్ష్యం గురించి ఆలోచించకుండా టీమ్‌ను గెలిపించేందుకు లేదా జట్టును ముందుకు తీసుకువెళ్లేందుకు ఏం చేయాలనేది వ్యక్తిగతంగా చేయాలనుకుంటాను అని అన్నాడు. ఇలాంటి సమయంలో జట్టు సభ్యులంతా అండగా నిలబడడం బాగుందన్నాడు. దేశం కోసం ఆడేటప్పుడు జట్టు ఒత్తిడిలో ఉన్నా సరే ప్రతి ఒక్కరూ మద్దుతు ఇచ్చారన్నాడు. ఇలాంటి సమయంలో భావోద్వేగాలను వివరించడం చాలా కష్టమని, దేశం తరుపున ఆడటాన్ని ఎప్పుడూ గర్వంగానే భావిస్తూ ఉంటాను అని పంత్ తెలిపాడు.
WCL 2025 : ఉతప్ప డకౌట్.. రాణించిన యూసఫ్ పఠాన్, యువీ, బిన్నీ.. కానీ..
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ముగిసే సరికి భారత్ ప్రస్తుతం 2-1 తేడాతో వెనుకబడి ఉంది. ఓవల్ వేదికగా జూలై 31 నుంచి ఆఖరి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని భారత్ భావిస్తోంది.