IND vs ENG: ఇంగ్లాండ్‌తో చివరి టెస్టు.. వాళ్లిద్దరిపై వేటు తప్పదా..! టాప్ స్పిన్నర్ వచ్చేస్తున్నాడా.. ఐదో టెస్ట్ ఆడే భారత తుది జట్టు ఇదే!
ఐదో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా ఆడే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. హెడ్ కోచ్ గంభీర్ అయితే బుమ్రా ఫిట్‌గా ఉన్నాడని, తుది జట్టులో అందుబాటులో ఉంటాడని చెప్పాడు.

Teamindia
IND vs ENG 5th test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఐదో టెస్టు మ్యాచ్ ఈ నెల 31 నుంచి లండన్‌లోని ది ఓవల్ మైదానం వేదికగా ప్రారంభంకానుంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు పూర్తికాగా.. 2-1తో భారత జట్టు వెనుకంజలో ఉంది. టీమిండియా ఈ సిరీస్ ను కోల్పోకుండా ఉండాలంటే ఐదో టెస్టులో తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి.
మరోవైపు టీమిండియా ప్లేయర్లు గాయాల బెడద వేదిస్తోంది. ఇప్పటికే రిషబ్ పంత్ సహా మరో ముగ్గురు ప్లేయర్లు సిరీస్ నుంచి వైదొలిగారు. ఈ క్రమంలో చివరి టెస్టుకోసం జట్టుకోసం ఎంపిక ఏ విధంగా ఉంటుందనేది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. అయితే, నాల్గో టెస్టులో ఆడిన ఇద్దరు ప్లేయర్లను పక్కన పెట్టి.. టాప్ స్పిన్నర్‌తోపాటు మరో ఇద్దరు కొత్తవారికి తుది జట్టులో అవకాశం దక్కుతుందని తెలుస్తోంది.
తొలి టెస్టులో పేవల ప్రదర్శనతో తరువాతి రెండు టెస్టులకు శార్దూల్ ఠాకూర్‌ను యాజమాన్యం పక్కన పెట్టింది. అయితే, నితీశ్, ఆకాశ్‌దీప్, అర్ష్‌దీప్‌లు గాయాలపాలు కావడంతో నాల్గో టెస్టుకు శార్దూల్‌కు మరోసారి అవకాశం దక్కింది. శార్దూల్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేక పోయాడు. దీనికితోడు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు.. నాల్గో టెస్టుతో టెస్టుల్లో అరంగ్రేటం చేసిన పేసర్ అన్షుల్ కాంబోజ్ సైతం ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. దీంతో వారిద్దరిని ఐదో టెస్టులో పక్కన పెట్టేందుకు గంభీర్, శభ్‌మన్ గిల్ నిర్ణయించినట్లు క్రికెట్ వర్గాల సమాచారం.
ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ ఫిట్‌నెస్ సాధించడంతోపాటు ప్రసిద్ధ్ కృష్ణ, కుల్‌దీప్ యాదవ్‌ల రూపంలో మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అయితే, ఇప్పటికే జట్టులో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉండటంతోపాటు వారు బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణిస్తుండటంతో ఐదో టెస్టులో కుల్దీప్ యాదవ్ ఎంట్రీ కష్టతరమనే చెప్పొచ్చు.
ఐదో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా ఆడే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. హెడ్ కోచ్ గంభీర్ అయితే బుమ్రా ఫిట్‌గా ఉన్నాడని, తుది జట్టులో అందుబాటులో ఉంటాడని చెప్పాడు. అంతేకాదు.. పేసర్లంతా అందుబాటులో ఉన్నారని గంభీర్ పేర్కొన్నాడు. ఒకవేళ బుమ్రా ఐదో టెస్టుకు అందుబాటులో ఉంటే మరో ఫాస్ట్ బౌలర్ సిరాజ్ కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ఐదో టెస్టు కీలక మ్యాచ్ కావటంతో ఇద్దరూ తుది జట్టులో ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు.. రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి రావడం ఖాయంగా తెలుస్తోంది. కరుణ్ నాయర్ స్థానంలో నాల్గో టెస్టులో ఆడిన సాయి సుదర్శన్ ఐదో టెస్టులోనూ తుది జట్టులో కొనసాగే అవకాశం ఉంది.
భారత తుది జట్టు(అంచనా)..
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్.