ENG vs IND Shubman Gill Gets Massive Threat Ahead Of Test Series
జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్‌లు సుధీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి గిల్ పైనే ఉంది. ఓ నాయకుడిగా మాత్రమే కాకుండా ఓ బ్యాటర్‌గా అతడు ఎలా రాణిస్తాడోనని అంతా ఆస్తిగా ఎదురుచూస్తున్నారు.
స్వదేశంలో గిల్ ప్రదర్శన గొప్పగా ఉన్నప్పటికి విదేశాల్లో అతడి ప్రదర్శన సంతృప్తిగా లేదు. విదేశాల్లో అతడు 15 మ్యాచ్‌లు ఆడగా 27.53 సగటుతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఉంది. ఇక స్వదేశంలో 17 మ్యాచ్‌ల్లో 42.03 సగటుతో 1177 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి.
ENG vs IND : భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్.. ఫ్రీగా మ్యాచ్‌లను ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు గిల్‌నే టార్గెట్ చేసుకుంటుందని, అతడి తొందరగా ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తుందని మాజీ ఆటగాడు నిక్‌నైట్ తెలిపాడు. ‘కెప్టెన్ ఒత్తిడిలో ఉంటే అది ఆ జట్టు డ్రెస్సింగ్ రూమ్ పై భారీ ప్రభావాన్ని చూపుతుంది. అందుకనే ప్రతి జట్టు కూడా ప్రత్యర్థి కెప్టెన్లనే ఎక్కువగా టార్గెట్ చేస్తుంటాయి. ఇక ఇంగ్లాండ్‌కు కూడా ఇదే విధంగా చేయచ్చు. గిల్ ను తొందరగా ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. అతడిని అసౌకర్యానికి గురి చేస్తుంది.’ అని నైట్ తెలిపాడు.
గిల్‌కు ఇది చాలా పెద్ద సిరీస్ అవుతుందన్నాడు. భారత కొత్త టెస్టు కెప్టెన్‌కు తాను అభిమానినని చెప్పుకొచ్చాడు. అండర్-19 ప్రపంచకప్ నుంచి అతడి ఆటను చూస్తున్నాను. అతడు తన టెక్నిక్‌ను ఇంకాస్త మెరుగుపరచుకోవాలి, ఆతిథ్య జట్టు అతడి వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకోవడంపై ఖచ్చితంగా ఫోకస్ చేస్తుందని నైట్ వెల్లడించాడు.
లీడ్స్ వేదికగా శుక్రవారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ 2025-27) సైకిల్ ఈ సిరీస్‌తోనే ఇరు జట్లకు ప్రారంభం అవుతుంది.