Mohammed Shami : షమీ బిర్యానీ తింటుండగా ఎగతాళి చేసిన రవిశాస్త్రి.. కట్ చేస్తే.. మహాద్భుతం జరిగింది..
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ తన బౌలింగ్‌తో భారత్‌కు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు.

Shami faced Biryani criticism responded with five wickets says Ravi Shastri
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ తన బౌలింగ్‌తో భారత్‌కు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. అందులో 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో జోహన్నెస్‌బర్గ్ టెస్టు మ్యాచ్ ఒకటి. ఆ మ్యాచ్‌లో విన్నింగ్ స్పెల్ బౌలింగ్ వేయడానికి షమీని ఎలా ప్రోత్సహించాడో భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి తాజాగా వెల్లడించాడు.
అప్పటికే భారత్ 0-2 తేడాతో టెస్టు సిరీస్‌లో వెనుకబడి ఉంది. జోహన్నెస్‌బర్గ్ టెస్టు మ్యాచ్‌లోనూ ఓడిపోతే సిరీస్ వైట్‌వాష్ అవుతుంది. ఈ టెస్టు మ్యాచ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో 241 పరుగుల టార్గెట్ సఫారీల ముందు ఉంది. సఫారీ బ్యాటర్లు నిలకడగా ఆడడంతో మ్యాచ్ గెలిచేందుకు దక్షిణాఫ్రికా చేరువగా వచ్చింది. మరో 104 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి.
లంచ్ విరామంలో షమీ భోజనం చేసేందుకు సిద్ధం అయ్యాడు. పెద్ద ప్లేట్‌లో బిర్యానీ పెట్టుకుని ఉన్నాడు. దీన్ని చూసిన అప్పటి కోచ్ రవిశాస్త్రి దీంతో ఇప్పుడు నీ ఆకలి తీరిపోతుందా ? అని అతడిని ప్రశ్నించాడు. దీంతో షమీకి విపరీతంగా కోపం వచ్చిందని, నాకు బిర్యానీ వద్దు అంటూ ప్లేట్‌ను తీసుకుపోమ్మని అతడు తనకు ప్లేట్‌ను ఇచ్చేసినట్లు రవిశాస్త్రి చెప్పాడు.
“𝘏𝘶𝘮𝘬𝘰 𝘩𝘶𝘮𝘦𝘴𝘩𝘢 𝘨𝘶𝘴𝘴𝘢 𝘬𝘢𝘳𝘢𝘰… 𝘱𝘩𝘪𝘳 𝘵𝘩𝘦𝘦𝘬 𝘩𝘰 𝘫𝘢𝘢𝘵𝘢 𝘩𝘢𝘪!” 🤭
Ravi Shastri & Bharat Arun drop a gem on Mohammed Shami, form, and… BIRYANI. 👀
Watch ‘Bharat Chale Chalo, Kahani 21-22 ki’ only on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/1RpouJhKlg
— Sony Sports Network (@SonySportsNetwk) June 17, 2025
ఈ సంఘటన తర్వాత భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తో కూడా శాస్త్రి మాట్లాడాడు. ‘షమీ కోపంగా ఉన్నాడు. ఇప్పుడు అతడితో మాట్లాకండి. ఒకవేళ అతడు మాట్లాడాలని అనుకుంటే మాత్రం ఒక్క విషయం చెప్పండి. మైదానంలో తన ప్రదర్శనతో (వికెట్లు తీయమని) సమాధానం చెప్పమని అడగండి.’ అంటూ శాస్త్రి తనకు చెప్పినట్లు అరుణ్ తెలిపాడు.
ఈ ఘటన తరువాత మైదానంలో అడుగుపెట్టిన షమీ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. 5 వికెట్లతో సత్తా చాటాడు. దీంతో ఓ దశలో 144/3 పరుగులతో పటిష్టంగా ఉన్న దక్షిణాఫ్రికా 177 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమ్ఇండియా 63 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుని వైట్‌వాష్ నుంచి తప్పించుకుంది.
ENG vs IND : రవిశాస్త్రి ఇలా.. సబా కరీమ్ అలా.. టెస్టుల్లో కోహ్లీ స్థానంలో ఆడే ఆడగాడి విషయంలో..
ఇక మ్యాచ్ గెలిచిన తరువాత షమీ డ్రెస్సింగ్ రూమ్‌లోకి అడుగుపెట్టినప్పుడు.. బిర్యానీతో నిండిన పెద్ద ప్లేట్‌ను శాస్త్రి అతడికి ఇచ్చాడు. అప్పుడు షమీ మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితి వస్తే తనకు మళ్లీ కోపం తెప్పించమని కోరినట్లుగా శాస్త్రి తెలిపాడు.