Glenn Maxwell : మాక్స్‌వెల్ విధ్వంసకర శతకం.. రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్ ల సరసన.. ఒకే ఒక్క ఆసీస్ ఆటగాడు..
టీ20 క్రికెట్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ అరుదైన ఘనత సాధించాడు.

Glenn Maxwell equals Rohit warner buttler's record after smashing century in MLC
టీ20 క్రికెట్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన నాలుగో బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2025లో భాగంగా లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాక్స్‌వెల్ సెంచరీ చేయడంతో ఈ ఘనత అందుకున్నాడు.
వాషింగ్టన్ ప్రీడం జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మాక్స్‌వెల్ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 48 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 49 బంతుల్లో 2 ఫోర్లు, 13 సిక్సర్లు బాది 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి స్ట్రైక్‌రేట్ 216.33 కావడం విశేషం.
ENG vs IND : రవిశాస్త్రి ఇలా.. సబా కరీమ్ అలా.. టెస్టుల్లో కోహ్లీ స్థానంలో ఆడే ఆడగాడి విషయంలో..
కాగా.. టీ20 క్రికెట్‌లో ఇది మాక్స్‌వెల్‌కు ఎనిమిదో సెంచరీ. ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్‌గేల్ 22 సెంచరీలతో ఈ జాబితాలో టాప్‌లో ఉన్నాడు.
టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
క్రిస్‌గేల్ – 22 శతకాలు
బాబర్ ఆజామ్ – 11 శతకాలు
విరాట్ కోహ్లీ – 9 శతకాలు
రిలీ రూసో – 9 శతకాలు
గ్లెన్ మాక్స్‌వెల్ – 8 శతకాలు
రోహిత్ శర్మ – 8 శతకాలు
జోస్ బట్లర్ – 8 శతకాలు
ఆరోన్ ఫించ్ – 8 శతకాలు
మైఖేల్ క్లింగర్ – 8 శతకాలు
డేవిడ్ వార్నర్ – 8 శతకాలు
ఒకే ఒక్క ఆసీస్ ఆటగాడు..
ఈ శతకంతో టీ20 క్రికెట్‌లో మాక్స్‌వెల్ 10500 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అతడి ఖాతాలో 178 వికెట్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో 10,500 పరుగులు చేయడంతో పాటు 170 ఫ్లస్ వికెట్లు, ఐదు కంటే ఎక్కువ సెంచరీలు చేసిన తొలి ఆస్ట్రేలియా ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మాక్స్‌వెల్ విధ్వంసకర శతకంతో మొదట బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్ 16.3 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. దీంతో వాషింగ్టన్ ఫ్రీడమ్ 113 పరుగుల తేడాతో గెలుపొందింది.