ENG vs IND : రవిశాస్త్రి ఇలా.. సబా కరీమ్ అలా.. టెస్టుల్లో కోహ్లీ స్థానంలో ఆడే ఆటగాడి విషయంలో..
జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. సీ

ENG vs IND who will play replace Virat Kohli in number 4 in tests
జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమ్ఇండియా బరిలోకి దిగనుంది. సీనియర్లు లేకుండా ఇంగ్లాండ్‌ను దాని సొంతగడ్డపై ఎదుర్కొనడం గిల్ సేనకు అత్యంత సవాల్‌తో కూడుకున్నదే.
సచిన్ వారసత్వాన్ని అందుకున్న కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌లో నంబర్ 4 స్థానంలో అద్భుతంగా ఆడాడు. ఇప్పుడు కోహ్లీ వీడ్కోలు పలకడంతో ఈ స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారు అనే దానిపై చర్చలు నడుస్తున్నాయి. ఈ స్థానంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆడతాడని కొందరు అంటుండగా, రీ ఎంట్రీ ప్లేయర్ కరుణ్ నాయర్ అయితే సరిగ్గా సరిపోతాడని ఇంకొందరు అంటున్నారు.
దీనిపై టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. కోహ్లీ స్థానంలో గిల్ ను ఆడించాలని సూచించాడు. జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా రావాలి. ఇక నంబర్ 3లో సాయి సుదర్శన్ ఆడాలి. నాలుగో స్థానంలో గిల్ రావాలి, ఐదో స్థానంలో కరుణ్ నాయర్ ఆడాలి. అని శాస్త్రి తెలిపాడు.
మాజీ సెలెక్టర్ సబా కరీమ్ మాట్లాడుతూ.. కోహ్లీ ఆడే నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ వస్తే బాగుంటుందని చెప్పాడు. ఇంగ్లాండ్‌లో రాహుల్‌కు అద్భుతమైన రికార్డు ఉందన్నాడు. 9 టెస్టుల్లో 614 పరుగులు చేశాడని, ఇందులో రెండు శతకాలు కూడా ఉన్నాయన్నాడు. నాలుగో స్థానానికి రాహుల్ సరిగ్గా సరిపోతాడని, అతడి వద్ద అద్భుతమైన టెక్నిక్ ఉందన్నాడు.
ENG vs IND : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ముందు.. లండన్‌లోని కోహ్లీ ఇంటికి గిల్, పంత్, సిరాజ్ ఇంకా..
లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్‌లో నాలుగో స్థానంలో ఎవరు ఆడతారనే దానికి సమాధానం దొరకనుంది.