ENG vs IND : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ముందు.. లండన్‌లోని కోహ్లీ ఇంటికి గిల్, పంత్, సిరాజ్ ఇంకా..
టీమ్ఇండియా టెస్టు కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, సిరాజ్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లును కోహ్లీ లండన్‌లోని తన నివాసానికి ఆహ్వానించాడు.

Shubman Gill and Rishabh Pant meets Virat Kohli's london house
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇటీవల కాలంలో ఎక్కువగా లండన్‌లోనే ఉంటున్నాడు. ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికిన తరువాత అతడు అక్కడే స్థిరనివాసం ఉంటాడనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్ పూర్తి కావడంతో కోహ్లీ లండన్‌కు వెళ్లిపోయాడు. కాగా.. భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో సిరీస్ కోసం లండన్‌లోనే ఉంది.
ఈ క్రమంలో టీమ్ఇండియా టెస్టు కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, సిరాజ్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లును కోహ్లీ లండన్‌లోని తన నివాసానికి ఆహ్వానించాడు. రెవ్‌స్పోర్ట్జ్ వీడియో నివేదిక ప్రకారం.. దాదాపు రెండు పాటు వీరంతా అక్కడ ఎంజాయ్ చేశారు. కోహ్లీ అంతర్జాతీయ టెస్టు, టీ20 క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు.
రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో శుభ్‌మన్ గిల్‌ను నూతన టెస్టు సారథిగా బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. కోహ్లీ, రోహిత్, అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లు లేకుండా గిల్ సేన ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. భారత క్రికెట్‌లో నూతన శకం మొదలైందని, భారత యువ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌లో ఎలా రాణిస్తారో అన్న ఆసక్తి అందరిలో ఉంది.
ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా జూన్ 20 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. హెడింగ్లేలోని లీడ్స్ మైదానం తొలి టెస్టుకు ఆతిథ్యం ఇవ్వనుంది.
ENG vs IND : తొలి టెస్టుకు ఎలాంటి పిచ్‌ను సిద్ధం చేశారో తెలుసా? క్యూరేటర్ షాకింగ్ కామెంట్స్..
భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..
తొలి టెస్టు – జూన్ 20 నుంచి జూన్ 24 వరకు – హెడింగ్లీ
రెండో టెస్టు – జూలై 2 నుంచి జూలై 6 వరకు – ఎడ్జ్‌బాస్టన్
మూడో టెస్టు – జూలై 10 నుంచి జూలై 14 వరకు – లార్డ్స్
నాలుగో టెస్టు – జూలై 24 నుంచి జూలై 27 వరకు – ఓల్డ్ ట్రాఫోర్డ్
ఐదో టెస్టు – జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు – కెన్నింగ్టన్ ఓవల్