Glenn Maxwell : మాక్స్‌వెల్ ఆ కొట్టుడు ఏంది.. తొలి 15 బంతుల్లో 11 పరుగులే కానీ.. తరువాతి 34 బంతుల్లో 13 సిక్సర్లు..
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు.

Glenn Maxwell stats of 11 in 15 but finishes 106 of 49
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్‌లో దుమ్మురేపాడు. వాషింగ్టన్ ఫ్రీడంకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాక్స్‌వెల్ లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో కేవలం 48 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 49 బంతులను ఎదుర్కొని 2 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు.
వాస్తవానికి ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడం 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బరిలోకి దిగిన మాక్స్‌వెల్ ఆరంభంలో చాలా నెమ్మదిగా ఆడాడు. మొదటి 15 బంతుల్లో కేవలం 11 పరుగులే చేశాడు. ఆతరువాత ఒక్కసారిగా గేమ్ మార్చాడు. సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి తన జట్టుకు భారీ స్కోరు అందించాడు.
ENG vs IND : తొలి టెస్టుకు ఎలాంటి పిచ్‌ను సిద్ధం చేశారో తెలుసా? క్యూరేటర్ షాకింగ్ కామెంట్స్..
GLENN MAXWELL IN THE MLC:
First 15 balls – 11 runs (0 fours, 0 sixes).
Last 34 balls – 95 runs (2 fours, 13 sixes).CRAZY BATTING FROM THE BIG SHOW. 🥶pic.twitter.com/kc4w96EC4D
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 18, 2025
మాక్స్ వీర విజృంభణతో మొదట బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడం నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో మాక్స్‌వెల్ కాకుండా.. మిచెల్ ఓవెన్ ఒక్కడే (11 బంతుల్లో 32) రాణించాడు. రచిన్ రవీంద్ర (8) ఆండ్రియస్ గౌస్ (12) మార్క్ చాప్‌మన్ (17) జాక్ ఎడ్వర్డ్స్ (11)లు విఫలం అయ్యారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో కోర్నె డ్రై, తన్వీర్ సంఘా తలా రెండు వికెట్లు తీశారు. జేసన్ హోల్డర్ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్ 16.3 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. దీంతో మాక్స్‌వెల్ జట్టు 113 పరుగుల తేడాతో గెలుపొందింది. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో అలెక్స్ హేల్స్, సునీల్ నరైన్, ఉన్ముక్త్ చంద్ లు డకౌట్ అయ్యారు. సైఫ్ బదర్ (32) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. వాషింగ్టన్ ఫ్రీడం బౌలర్లలో మిచెల్ ఓవెన్, జాక్ ఎడ్వర్డ్స్ లు చెరో మూడు వికెట్లు తీశారు. సౌరభ్ నేత్రావల్కర్ రెండు వికెట్లు పడగొట్టాడు. మార్క్ అడైర్, ఇయాన్ హాలండ్ చెరో వికెట్ సాధించారు.