ENG vs IND : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్.. గిల్ నుంచి జడేజా వరకు.. భారత ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు ఇవే..
శుక్రవారం నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

ENG vs IND Gill to jadeja indian stars eye on these records
శుక్రవారం నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు మ్యాచ్ జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్‌లో జరగనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రవీండ్ర జడేజా, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, సిరాజ్ లు పలు రికార్డులు అందుకునే అవకాశం ఉంది.
శుభ్‌మన్ గిల్..
టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టెస్టుల్లో 2వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు మరో 107 పరుగులు అవసరం. ఇప్పటి వరకు గిల్ 32 మ్యాచ్‌ల్లో 35.05 సగటుతో 1893 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే.. ఇంగ్లాండ్‌లో గిల్ రికార్డు ఏమంత గొప్పగా లేదు. 6 ఇన్నింగ్స్‌ల్లో 88 పరుగులు మాత్రమే చేశాడు.
ENG vs IND : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్.. టీమ్‌ఇండియా స్క్వాడ్‌లోకి మరో ఆటగాడు..!
యశస్వి జైస్వాల్..
టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టుల్లో 2వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు మరో 202 పరుగులు అవసరం. ఇప్పటి వరకు యశస్వి 19 టెస్టుల్లో 52.88 సగటుతో 1798 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు, 10 అర్థశతకాలు ఉన్నాయి.
కేఎల్ రాహుల్..
అంతర్జాతీయ క్రికెట్‌లో 9వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు కేఎల్ రాహుల్ దగ్గరగా ఉన్నాడు. ఇప్పటి వరకు రాహుల్ 215 మ్యాచ్‌ల్లో 8565 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
WTC 2025-27 : డబ్ల్యూటీసీ నాలుగో సైకిల్ షురూ.. 9 జట్లు 131 మ్యాచ్‌లు.. భారత జట్టు షెడ్యూల్ ఇదే..
రిషబ్ పంత్..
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ టెస్టుల్లో 3వేల పరుగులు పూర్తి చేసేందుకు మరో 52 పరుగులు అవసరం. ఇప్పటి వరకు పంత్ 47 టెస్టుల్లో 42.1 సగటుతో 2948 పరుగులు చేశాడు. ఇందులో 6 శతకాలు, 15 అర్థశతకాలు ఉన్నాయి.
రవీంద్ర జడేజా..
స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఓ ప్రత్యేక మైలురాయిని చేరుకోవాలని చూస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 7వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు జడేజాకు ఇంకా 309 పరుగలు అవసరం.
సిరాజ్..
పేసర్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 200 వికెట్ల క్లబ్‌లో చేరేందుకు కేవలం 15 వికెట్ల దూరంలో ఉన్నాడు.
ENG vs IND : ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత కెప్టెన్ ఎవరో తెలుసా?
వీరిలో కొందరు తొలి టెస్టులో మిగిలిన వారు ఈ సిరీస్‌లో ఈ రికార్డులకు అందుకునే అవకాశ ఉంది.