ENG vs IND : తొలి టెస్టుకు ఎలాంటి పిచ్‌ను సిద్ధం చేశారో తెలుసా? క్యూరేటర్ షాకింగ్ కామెంట్స్‌..

భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

ENG vs IND : తొలి టెస్టుకు ఎలాంటి పిచ్‌ను సిద్ధం చేశారో తెలుసా? క్యూరేటర్ షాకింగ్ కామెంట్స్‌..

ENG vs IND how the Headingley track looks like ahead of first Test

Updated On : June 18, 2025 / 8:58 AM IST

భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. హెడింగ్లీలోని లీడ్స్ వేదిక‌గా తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ క్ర‌మంలో లీడ్స్ పిచ్ ఎలా ఉండ‌నుంది? పేస‌ర్ల‌కు అనుకూలిస్తుందా? బ్యాటింగ్ స్వ‌ర్గ‌ధామంగా ఉంటుందా ? అన్న ఆస‌క్తి అంద‌రిలో ఉంది.

గ‌తంలో భార‌త జ‌ట్టు ఎప్పుడూ విదేశాల్లో ఆడినా కూడా పేస్ పిచ్‌లే ఎదురు అయ్యేవి. అయితే.. ఇప్పుడు బుమ్రా, సిరాజ్ వంటి బౌల‌ర్లు జ‌ట్టులో ఉండ‌డంతో అచ్చంగా పేస్ పిచ్‌ల‌ను రూపొందించేందుకు ప్ర‌త్య‌ర్థి జ‌ట్లు ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్ర‌మంలోనే లీడ్స్ పిచ్ గురించి క్యూరేట‌ర్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి.

ENG vs IND : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌.. గిల్ నుంచి జ‌డేజా వ‌ర‌కు.. భార‌త ఆట‌గాళ్ల‌ను ఊరిస్తున్న రికార్డులు ఇవే..

బ్యాట్, బంతి మధ్య మంచి సమతుల్యతను కోరుకుంటున్నానని పిచ్ క్యూరేటర్ రిచ‌ర్డ్ రాబిన్స‌న్ చెప్పాడు. రెవ్స్‌పోర్ట్జ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. తొలుత బ్యాటింగ్ చేసిన జ‌ట్టు 300 ప‌రుగుల స్కోరు సాధిస్తే మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని తాను భావిస్తున్న‌ట్లు తెలిపాడు. మ్యాచ్ సాగే కొద్ది పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంద‌న్నాడు.

‘ఇక్క‌డ వేస‌వి కాలం కావ‌డంతో వేడి వాతావ‌ర‌ణం ఉంది. కాబ‌ట్టి ప్రారంభంలో కొంత తేమ‌ను ఉంచి అది ఎలా ఉంటుందో చూస్తాము. గ‌డ్డిని దాదాపుగా క‌త్తిరించివేస్తాము. పిచ్ 5 రోజులు ఉండేలా మేం చాలా నీళ్లు పోస్తున్నాం. ఇది 5 రోజుల టెస్టు మ్యాచ్ అవుతుందని భావిస్తున్నా, మూడు రోజుల్లో ముగియ‌కూడ‌దు అని కోరుకుంటున్నాను.’ అని అన్నాడు.

‘మ్యాచ్ ప్రారంభంలో బౌల‌ర్లకు ఎక్కువ‌గా స‌హ‌క‌రించే అవ‌కాశం ఉంది. మ్యాచ్ సాగే కొద్ది బ్యాట‌ర్లు పిచ్‌పై త‌మ స‌మ‌యాన్ని ఆస్వాదిస్తారు. తొలి ఇన్నింగ్స్ ఆడే జ‌ట్టు కాస్త జాగ్ర‌త్త‌గా ఆడాల్సి ఉంటుంది. మిగిలిన ఇన్నింగ్స్‌లో తొలి ఇన్నింగ్స్ కంటే ఎక్కువ స్కోరు న‌మోద‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి.’ అని రిచ‌ర్డ్ రాబిన్స‌న్ తెలిపాడు.

ENG vs IND : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌.. టీమ్‌ఇండియా స్క్వాడ్‌లోకి మరో ఆటగాడు..!

సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్ర‌న్ అశ్విన్‌లు సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో భార‌త క్రికెట్‌లో కొత్త శ‌కం మొద‌లైంది. ఇంగ్లాండ్‌లో శుభ్‌మ‌న్ గిల్ నాయ‌క‌త్వంలోని యువ భార‌త్ ఎలా ఆడుతుందోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.