ENG vs IND : ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్ .. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం నమోదు

మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ జట్టు అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ముంబై వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది.

ENG vs IND Women : మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ జట్టు అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ముంబై వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. అంతేకాక.. కేవలం ఒకేఒక్క సెషన్ లో పది వికెట్లను తీసి సంచలన విజయం నమోదు చేసింది. 479 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు బ్యాటర్లు భారత బౌలర్ల దాటికి కేవలం 131 పరుగులకే ఆలౌట్ అయ్యారు. భారత్ స్పిన్నర్లు దీప్తి శర్మ, రాజేశ్వరీ గైక్వాడ్ చెలరేగడంతో మూడో రోజు తొలి సెషన్ లోనే ఇంగ్లండ్ చాపచుట్టేసింది.

Also Read : Rohit Sharma : సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా రోహిత్ శర్మ..? ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందా

భారత్ ఉమెన్స్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 428 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మహిళా జట్టు కేవలం 136 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ స్పిన్నర్ దీప్తి శర్మ ఐదు వికెట్లు తీసింది. ఆ తరువాత రెండో ఇన్సింగ్ లో భారత్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసి డిక్లేర్డ్ ప్రకటించింది. 479 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్లు భారత్ బౌలర్ల దాటికి క్రీజులో నిలవలేక పోయారు. భారత్ స్పిన్నర్లు దీప్తి శర్మ, రాజేశ్వరీ గైక్వాడ్ చెలరేగడంతో మూడోరోజు తొలి సెషన్ లోనే ఇంగ్లాండ్ బ్యాటర్లు 131 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో భారత్ మహిళల జట్టు టెస్టు క్రికెట్ చరిత్రలో భారీ విజయాన్ని నమోదు చేసింది.\

Also Read : Rohit Sharma : రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించిన తరువాత ముంబై ఇండియన్స్ ట్వీట్.. జట్టు టోపీలను కాల్చేసిన అభిమానులు

మహిళా టెస్టు క్రికెట్ లో ఇప్పటి వరకు శ్రీలంకపై 1998లో పాకిస్థాన్ జట్టు 309 పరుగులు తేడాతో గెలిచింది. ఇప్పుడు ఆ రికార్డును భారత్ జట్టు అధిగమించింది. ఇంగ్లాండ్ జట్టుపై 347 పరుగుల తేడాతో విజయం సాధించింది సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇదిలాఉంటే.. భారత్ మహిళల జట్టు టెస్టుల్లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేయడం అభినందనీయం అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. బీసీసీఐ సెక్రటరీ జైషా భారత మహిళ జట్టును ట్విటర్ వేదికగా అభినందించారు. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో అద్భుత విజయం జట్టు సమిష్టి కృషి అని అభినందించారు.

స్కోర్ వివరాలు ఇలా..
భారత్ తొలి ఇన్నింగ్స్ .. 428
రెండో ఇన్నింగ్స్ 186/6 (డిక్లేర్డ్)

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 136
రెండో ఇన్నింగ్స్ 131

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు