ENG-W vs IND-W 1st t20
నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ పై ఇంగ్లాండ్ మహిళల జట్టు ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ 0-1తో వెనుకబడి ఉంది. అసలే ఓటమి బాధలో ఉన్న ఇంగ్లాండ్‌కు మరో షాక్ తగిలింది. ఆ జట్టుకు భారీ జరిమానా పడింది.
భారత్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు స్లో ఓవర్ రేటు నమోదు చేసింది. నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు తక్కువగా వేసింది. దీంతో ఒక్కో ఓవర్‌కు 5 శాతం చొప్పున మొత్తం 10 శాతం జరిమానాగా ఐసీసీ విధించింది.
ENG vs IND : నెట్స్‌లో కోపంతో ఊగిపోయిన సిరాజ్.. నా బ్యాట్ ఎవరు విరగొట్టారు?.. వీడియో వైరల్..
‘ఇది ఆర్టికల్ 2.22 నిబంధన ఉల్లంఘన కిందికి వస్తుంది. ఐసీసీ జరిమానాను ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ స్వీకరించింది. ఇంగ్లాండ్ తుది జట్టులోకి సభ్యులందరికీ ఈ జరిమానా వర్తిస్తుంది.’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన (112; 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఆ తరువాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 14.5 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. టీమ్ఇండియా బౌలర్లలో కడప అమ్మాయి శ్రీచరణి నాలుగు వికెట్లతో ఇంగ్లాండ్ వెన్ను విరిచింది. దీప్తి శర్మ, రాధ యాదవ్ లు తలా రెండు వికెట్లు తీశారు.