ENG-W vs IND-W Smriti Mandhana and Shafali Verma Script World Record In T20I Cricket
టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా ఓపెనర్లు స్మృతి మంధాన-షఫాలీ వర్మలు అరుదైన ఘనత సాధించారు. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సార్లు 50 ఫ్లస్ భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీగా చరిత్ర సృష్టించింది. శనివారం నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇంగ్లాండ్ మహిళలతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఈ ఘనత అందుకున్నారు.
ఈ మ్యాచ్‌లో మంధాన-షపాలీ జోడి తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించారు. ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక సార్లు 50 ఫ్లస్ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా రికార్డులకు ఎక్కింది. మంధాన-షఫాలీ జోడి 21 సార్లు 50 ఫస్ల్ కంటే ఎక్కువ భాగస్వామ్యాలు నమోదు చేసింది.
Heatattack : విషాదం.. సిక్స్ కొట్టి గుండెపోటుతో పిచ్ మధ్యలోనే బ్యాటర్ మృతి..
ఇక ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన సెంచరీ చేసింది. 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 112 పరుగులు సాధించింది. ఈ క్రమంలో మూడు ఫార్మాట్లలలో (టెస్టులు, వన్డేలు, టీ20లు) సెంచరీ చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా స్మృతి రికార్డులకు ఎక్కింది.
మంధాన శతకం బాదడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు భారీ స్కోరు సాధించింది. హర్మన్ డియోల్ (43), షెఫాలీ వర్మ (20) లు రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ మహిళల జట్టు 14.5 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో అరంగ్రేట ప్లేయర్, కడప అమ్మాయి శ్రీచరణి నాలుగు వికెట్లతో సత్తా చాటింది. రాధ యాదవ్, దీప్తి శర్మలు చెరో రెండు వికెట్లు తీశారు.
ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.