Heatattack : విషాదం.. సిక్స్ కొట్టి గుండెపోటుతో పిచ్ మ‌ధ్య‌లోనే బ్యాట‌ర్ మృతి..

క్రికెట్ మ్యాచ్‌లో ఓ బ్యాట్స్‌మెన్ సిక్స్ కొట్టి వెంటనే మరణించిన హృదయ విదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Heatattack : విషాదం.. సిక్స్ కొట్టి గుండెపోటుతో పిచ్ మ‌ధ్య‌లోనే బ్యాట‌ర్ మృతి..

Firozpur Batter dies on pitch due to heart attack after hitting six

Updated On : June 29, 2025 / 4:47 PM IST

క్రికెట్ మ్యాచ్‌లో ఓ బ్యాట్స్‌మెన్ సిక్స్ కొట్టి ఆ వెంటనే మరణించిన హృదయ విదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

హర్జీత్ సింగ్ అనే వ్య‌క్తి త‌న స్నేహితుల‌తో క‌ల‌సి ఫిరోజ్‌పూర్‌లోని డిఎవి స్కూల్ మైదానంలో క్రికెట్ ఆడుతున్నాడు. బౌల‌ర్ వేసిన బంతిని హ‌ర్జీత్ సింగ్ భారీ సిక్స్‌గా మ‌లిచి త‌న జ‌ట్టులో జోష్‌లో నింపాడు. అత‌డు పిచ్ మ‌ధ్య‌లోకి వ‌చ్చి మోకాళ్ల కూర్చున్నాడు. అదే స‌మ‌యంలో నాన్ స్ట్రైక‌ర్ బ్యాట‌ర్ సైతం అత‌డి వ‌ద్ద‌కు వ‌చ్చాడు. అత‌డు చూస్తుండ‌గానే హ‌ర్జీత్ కుప్ప‌కూలిపోయి అప‌స్మార‌క స్థితికి చేరుకున్నాడు.

Jasprit Bumrah : సుదీర్ఘ ఫార్మాట్‌లో బుమ్రా భ‌విష్య‌త్తు ఏంటి? వ‌రుస‌గా రెండు టెస్టులు ఆడ‌డం క‌ష్ట‌మేనా?

అత‌డు కింద‌ప‌డిపోవ‌డాన్ని చూసిన మిగిలిన వాళ్లు వెంట‌నే అత‌డి వ‌ద్ద‌కు ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చారు. సీపీఆర్ చేసి బ‌తికించే ప్ర‌య‌త్నం సైతం చేశారు. అయితే.. ఆ ప్ర‌య‌త్నాలు ఏమీ ఫ‌లించ‌లేదు. అత‌డు చ‌నిపోయాడు. గుండెపోటు కార‌ణంగానే అత‌డు చ‌నిపోయిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

ENG vs IND : శుభ్‌మ‌న్ గిల్ కెప్టెన్సీపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు.. ఇంగ్లాండ్‌లో టీమ్ఇండియా ఓడిపోతే..

గ‌తంలో ముంబైలోనూ ఇలాంటి సంఘ‌ట‌న‌నే జ‌రిగింది. క్రికెట్ ఆడుతూ రామ్ గ‌ణేష్ తేవార్ అనే వ్య‌క్తి సిక్స్ కొట్టి వెంట‌నే కుప్ప‌కూలిపోయాడు. అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్లు స్నేహితులు తెలిపారు.